80 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

80 కిలోల గంజాయి స్వాధీనం

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

మణుగూరు టౌన్‌: భద్రాచలం నుంచి మణుగూరు మీదుగా తరలిస్తున్న 80 కేజీల గంజాయిని గురువారం పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రవీంద్రా రెడ్డి కథనం ప్రకారం.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన సురేంద్ర సింగ్‌, ధర్మేంద్రకుమార్‌, కపిల్‌ దేవ్‌ గంజాయి వ్యాపారం చేస్తున్నారు. కపిల్‌దేవ్‌ రూ.50 వేలు ఇస్తానని చెప్పడంతో మిగిలిన ఇద్దరు ఒడిశా నుంచి కారులో సుమారు రూ.40 లక్షల విలువైన 80 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో మణుగూరు తోగ్గూడెం సమ్మక్క–సారలమ్మ గుడి వద్ద మణుగూరు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు గుర్తించి వాహనంతోసహా స్వాధీనం చేసుకున్నారు. సురేంద్రసింగ్‌, ధర్మేంద్రకుమార్‌లను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

అన్నపురెడ్డిపల్లిలో 88 కేజీలు..

ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లిలో రూ. 44 లక్షల విలువైన 88 కిలోల గంజాయిని స్థాని క, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలు వెల్లడించారు. వెంకటాపురం క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులు, కేరళకు చెందిన మహమ్మద్‌ రిషాద్‌, డ్రైవర్‌ సిరాజ్‌ కుంజా విఠల్‌ను అరెస్ట్‌ చేశారు. చింతూరు నుంచి భద్రాచలం, అన్నపురెడ్డిపల్లి మీదుగా కేరళకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. రిషాద్‌, మరో గంజాయి స్మగ్లర్‌ హర్షద్‌ కలిసి బెంగళూరు జైలులో ఉన్నారు. ఇటీవల విడుదలైన రిషాద్‌... హర్షద్‌ ఆర్థిక సహకారంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని డీఎస్పీ తెలిపారు. జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై విజయసింహా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement