అశ్వాపురం: మండలంలో బుధవారం గాలివాన బీభత్సం స్పష్టించింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో చెట్లు నేలకూలాయి. అలాగే, మండల కేంద్రంలోని బుడుగుబజార్‌లో బైరోజు కాంతయ్య రేకుల ఇల్లు పూర్తిగా నేలమట్టమై గృహోపకరణా లు, సామగ్రి దెబ్బతిన్నాయి. ముందే అప్రమత్తమై కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. అలాగే, జగ్గారంతండాలో మోతుకూరి సురేశ్ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోగా, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరాయి. కాగా, ఇళ్లు ధ్వంసమైన బుడుగుబజార్‌లోని బైరోజు కాంతయ్య, సీతారాంపురంలో నూప వెంకన్న కుటుంబాలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా, ఆయన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. గ్రామ సర్పంచ్ సబ్క పిచ్చయ్యతో పాటు కందుల లక్ష్మణ్, అలిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


