పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రా మాల మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ నూతన ఈఓగా అద్దెంకి విజయ్ కుమార్ సోమవారం విధుల్లో చేరారు. ప్రసు త్తం ఈఓగా ఉన్న రజినీకుమారి అనారోగ్య కారణాలతో సెలవులో వెళ్లారు. దీంతో వరంగల్ భద్రకాళి ఆలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిపై గ్రేడ్–1 ఈఓగా నియమితులైన విజయ్‌కుమార్‌ను పెద్దమ్మతల్లి ఆలయ రెగ్యులర్ ఈఓగా నియమించారు. దీంతో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ
కొత్తగూడెంఅర్బన్: జర్నలిస్టు యూనియన్ల నుంచి అందిన వినతి మేరకు ఎయిడెడ్, ప్రైవే ట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ 50 శాతం ఇవ్వాలని సూ చిస్తూ విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ మేరకు పిల్లలు చదువుతున్న పాఠశాల వివరాలు, అక్రిడిటేషన్ కార్డు, ఆధార్ కార్డుతో సంప్రదించా లని విద్యాశాఖ ఏడీ శంభుప్రసాద్ సూచించా రు. అక్రిడిటేషన్ కార్డు రాని వారి వివరాలను యూనియన్ల నాయకులు అందిస్తే జిల్లా విద్యా శాఖ నుంచి పాఠశాలలకు ఉత్తర్వులు పంపిస్తామని తెలిపారు.
నేటి నుంచి సింగరేణి
అధికారుల ఆందోళన?
రుద్రంపూర్: సింగరేణిలో అధికారుల సమస్య లను యాజమాన్యం పరిష్కరించడం లేదని, కేంద్ర, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదంటూ ఆందోళన చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. బుధవారం నుంచి రామగుండం రీజియన్‌లో, ఈ నెల 20న కొత్తగూ డెం రీజియన్‌లో సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యాన నిరసన తెలపనున్నట్లు తెలిసింది. అధికారులకు మూడేళ్లుగా ప్రాఫిట్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) బకాయిలు రూ.277 కోట్లు రావాల్సి ఉండగా, మంత్రులు, డైరెక్టర్లను కలిసినా ఫలి తం లేదని చెబుతున్నారు. అంతేకాక పీఆర్‌పీ చెల్లింపుపై కోలిండియా నుంచి ఉత్తర్వులు ఉన్నాయా అని ప్రశ్నిస్తుండడంతో చేసేదేం లేక ఆందోళన బాట పడుతున్నట్లు తెలిసింది.
ఏడుగురికి నాయబ్
తహసీల్దార్లుగా పదోన్నతి
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న పలువురికి నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈమేరకు కలెక్టర్ దివాకర టీ.ఎస్. మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక వీరిని ఖాళీగా ఉన్న స్థానాల్లో కేటాయించారు. ఈమేరకు నేలకొండపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న జి.లక్ష్మణ్‌ను వేంసూరుకు, కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న పఠాన్ ఖాజా మొహినుద్దీన్‌ను మధిరకు బదిలీ చేసి డిప్యూటేషన్‌పై కూసుమంచికి కేటాయించారు. అలాగే, కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న కె.అప్పిరాములును అక్కడే కేటాయించగా, ఖమ్మం ఎస్‌డీసీ(రైల్వేస్)లో విధులు నిర్వర్తిస్తున్న ఎన్.జగదీష్‌కుమార్‌ను ఖమ్మం ఆర్‌డీఓ ఆఫీస్‌కు, ఖమ్మం రూరల్ మండలంలో పనిచేస్తున్న కే.వీ.వీ.ప్రసాద్‌ను ఖమ్మం డీసీఎస్‌ఓకు బదిలీ చేసి డిప్యూటేషన్‌పై కొణిజర్లలో విధులు కేటాయించారు. ఇక కామేపల్లి తహసీల్ నుంచి దినవాహి జ్యోతికి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చి ఎర్రుపాలెంకు, పాల్వంచ ఎస్‌డీసీలో విధులు నిర్వర్తిస్తున్న ఎం.సులోచనకు పెనుబల్లిలో పోస్టింగ్ ఇచ్చి డిప్యూటేషన్‌పై ఏన్కూరుకు కేటాయించారు.
కొనసాగిన
బస్సుల తనిఖీలు
ఖమ్మంక్రైం: ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోని ప్రైవేట్ పాఠశాలల బస్సుల గుర్తింపునకు రవాణా శాఖ అధికారులు రెండో రోజైన మంగళవారం కూడా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న మూడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు బస్సులను గుర్తించి కేసు నమోదు చేశా మని ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ రవాణాశాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇకనైనా పాఠశాలల యాజమాన్యాలు అన్ని బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని, లేనిపక్షంలో సీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలి
కూసుమంచి: రైతుల వివరాల నమోదుకు చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీని నూరుశాతం పూర్తి చేయా లని ఖమ్మం డీఏఓ డి.పుల్లయ్య సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ, యాప్ తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన కూసుమంచిలోని రైతువేదిక నుంచి హాజరయ్యారు. అనంతరం శాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీపై దృష్టి సారించడమే కాక రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ తర్వాత పాలేరులోని ఎరువుల దుకాణాలను డీఏఓ తనిఖీ చేశారు. ఆత్మ పీడీ సరిత, కూసుమంచి ఏడీఏ సతీశ్, ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు.


