ఇల్లెందు: పట్టణంలోని సీఈఆర్ క్లబ్‌లో రెండు రాష్ట్రాలస్థాయి డ్యాన్స్ పోటీలు ఆదివారం ప్రారంభమై సోమవారం ముగిశాయి. కడారి వెంకట్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో బాల, సాయి జ్ఞాపకార్థం, 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య జన్మదినం సందర్భంగా ఈ పోటీలు ఏర్పాటు చేశారు. సీనియర్ గ్రూపు విభాగంలో నాచురల్ నవీన్ టీం(వరంగల్), ఎంజే అశోక్ టీం(మణుగూరు)కు ప్రథమ బహుమతి లభించగా కల్యాణ్ టీం (భూపాలపల్లి)కు ద్వితీయ, గణేశ్ టీం(భూపాలపల్లి)కు తృతీయ బహుమతి వచ్చాయి. జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి వనపర్తి టీం, ద్వితీయ జమ్మికుంట టీం, తృతీయ బహుమతి గోదావరిఖని టీం గెలుపొందాయి. సీనియర్ సోలోలో విశాఖపట్నం టీం ప్రథమ, పరమేశ్‌కుమార్ (హైదరాబాద్) ద్వితీయ, లాస్య (జమ్మికుంట) తృతీయ బహుమతు సాధించారు. విజేతలకు కౌన్సిలర్ సారయ్య, పాబోలు స్వాతి, పింగళి అనూహ్య బహుమతులు అందజేశారు.


