మణుగూరు టౌన్: పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో, పీకేఓసీ–2 గేట్ వద్ద నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 8న యాజమాన్యానికి 31 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు. డిపెండెంట్లకు నియామకపత్రాలు ఇవ్వాలని, 40 శాతం లాభాల వాటా, విద్యుత్ కంపెనీలు సింగరేణికి బకాయి ఉన్న రూ.56 వేల కోట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. సొంతింటి పథకం అమలు చేయాలని, రూ. 30 లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలని కోరారు. మణుగూరు భవిష్యత్ కోసం పీకేఓసీ–2 డీప్‌సైడ్ ఎక్స్‌టెన్షన్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. సేవ్ సింగరేణి– సేవ్ మణుగూరు అనే నినాదంతో అన్ని యూనియన్లను, రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమం చేపడతామన్నారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు మేకల ఈశ్వర్‌రావు, ఆవుల నాగరాజు, బి.సురేందర్, శనిగరపు కుమారస్వామి, సీపీఐ పట్టణ కార్యదర్శి దర్గ్యాల సుధాకర్, ఇమాముద్దీన్, తేనేటి నారాయణ, శ్రీనివాస్ యాదవ్, రవికుమార్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాజ్‌కుమార్


