●అమ్మ ఆదర్శ, పీఎంశ్రీ పాఠశాలల్లో మెరుగుపడుతున్న సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

●అమ్మ ఆదర్శ, పీఎంశ్రీ పాఠశాలల్లో మెరుగుపడుతున్న సౌకర్యాలు

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

●అమ్మ ఆదర్శ, పీఎంశ్రీ పాఠశాలల్లో మెరుగుపడుతున్న సౌకర్యాలు ●118 ప్రీప్రైమరీ పాఠశాలలు

జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలలు, పీఎం శ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్‌, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల నిర్వహణ బాధ్యత అంతా కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పీఎం శ్రీ పథకానికి కేంద్రం నుంచి దశల వారీగా నిధులు విడుదల కావడంతో పాఠశాలల్లో క్రీడలకు, ల్యాబ్‌ల నిర్మాణాలకు ఉపయోగపడుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ప్రీప్రై మరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లాలో 118 పాఠశాలలను ఎంపిక చేశారు. ఉపాధ్యాయులు, ఆయాల నియామకానికి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయితే తరగతులు ప్రారంభంకానున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement