వచ్చేనెల 1నుంచి అమల్లోకి వేతన సవరణ | - | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 1నుంచి అమల్లోకి వేతన సవరణ

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

ఆర్‌టీసీ రీజినల్‌ మేనేజర్‌ సరిరామ్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్‌లో చేపట్టిన సమ్మె సమయాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అడుగులు పడుతున్నాయని, ఇందులో భాగంగా 2021 వేతన సవరణ వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలవుతుందని ఆర్టీసీ ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ ఏ.సరిరామ్‌ తెలిపారు. ఖమ్మంలోని కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు అంశాలపై ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సానుకూలంగా స్పందించిందని చెప్పారు. త్వరలోనే యూనియన్లను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఎన్నికల నిర్వహించాక, గుర్తింపు పొందిన యూనియన్‌ నుంచి సభ్యుడిని విలీన కమిటీలోకి తీసుకుంటారని వెల్లడించారు. అలాగే, విలీన ప్రక్రియకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా అంశాలపై సమీక్షలు నిర్వహించగా, కార్మికుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని ఆర్‌ఎం వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్‌ఎం వి.మల్లయ్య పాల్గొన్నారు.

బీఎల్‌ఏలు సైనికుల్లా పనిచేయాలి

టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ షబ్బీర్‌ అలీ

మణుగూరు టౌన్‌: దేశంలో రాహుల్‌ గాంధీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న పోరాటం బూత్‌ స్థాయిలో విజయం సాధించినప్పుడే సార్థకమవుతుందని, బీఎల్‌ఏలు సైని కుల్లా పనిచేయాలని టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన బూత్‌ లెవల్‌ ఏజంట్ల శిక్షణా శిబిరంలో మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటుహక్కు కల్పించడం, దొంగ ఓట్లు గుర్తింపు ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలన్నా రు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న మా ట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, మృతుల పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలను ఫారం–6, 7,8 ద్వారా పూర్తి చేయించాలన్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం నాయకులను శాలువాలతో సన్మానించారు. జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చీకటి కార్తీక్‌, మాజీ ఎంఎల్‌సీ నర్సిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఎఫ్‌బీఓతో ఆరుగురి దురుసు ప్రవర్తన

పాల్వంచరూరల్‌: రిజర్వ్‌ ఫారెస్టుకు చెందిన భూమిలో మట్టిని తరలించేందుకు ప్రయత్నిస్తు న్న వారిని అడ్డుకున్న బీట్‌ ఆఫీసర్‌పై ఆరుగు రు దురుసుగా వ్యవహరించిన ఘటన ఇది. రేంజర్‌ సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగం గ్రామ పంచాయ తీ పరిధి సంగం గట్టు సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్టుకు సంబంధించిన భూమిలో మట్టిని అక్రమంగా తరలించేందుకు ఈనెల 11న జేసీ బీ, ట్రాక్టర్లు తీసుకురావడంతో సమాచారం అందుకున్న బీట్‌ ఆఫీసర్‌ హరి సంఘటన స్థలానికి వెళ్లి అట్టుకున్నారు. దీంతో అక్కడున్న ఆరుగురు ఎఫ్‌బీఓపై దురుసుగా వ్యవహరించి విధులకు ఆటకం కల్గించారు. దీంతో ఎఫ్‌బీఓ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వైదిక పోస్టుల భర్తీకి పరీక్షలు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం దేవస్థానంలో ఖాళీగా ఉన్న వైదిక పోస్టుల భర్తీకి శనివారం హైదరాబాద్‌లోని కాచిగూడ తుల్జా భవన్‌ ధర్మశాలలో రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌, చీఫ్‌ ఎగ్జామినర్‌తో పాటు సంబంధిత పోస్టుల ఎంపిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

అటవీ అధికారుల తీరు సరికాదు

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లిలోని గుడిపాడులో 25ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వకుండా అటవీ అధికారులు ఏటా అడ్డుకోవడం సరికాదని పీఓడబ్ల్యూ రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ పేర్కొన్నారు. గుడిపాడులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అటవీ అధికారులు ప్రతీ సీజన్‌లో పోడుదారులు, మహిళలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా సర్వే చేసి పట్టాలు ఇవ్వడమే కాక ఆదివాసీ గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు శిరోమణి, ఝాన్సీ, దుర్గా, సరోజిని, పద్మ, నర్సమ్మ, పరిమళ, అమర్లపూడి శరత్‌, నాగిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement