సెర్ప్‌, ఉపాధి సిబ్బందికి వైద్య పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

సెర్ప్‌, ఉపాధి సిబ్బందికి వైద్య పరీక్షలు

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

చుంచుపల్లి: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్య దేవరాజన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలో పనిచేస్తున్న సెర్ప్‌, ఉపాధి సిబ్బందికి ఎరిక్సన్‌ ఇన్సూరెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌, సౌజన్యంతో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. డీఆర్‌డీఓ విద్యాచందన పరిశీలించి, పరీక్షలు చేయించు కున్నారు. ఇలాంటి శిబిరాలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతాయని ఆమె అన్నారు. హెల్త్‌ క్యాంపులను హైదరాబాద్‌ యశోద వైద్యశాల, శరత్‌ మాక్స్‌ విజన్‌ వరంగల్‌, ఎరిక్సన్‌ ఇన్సూరెన్స్‌ సహకారంతో నిర్వహించారు.

జడ్జిని కలిసిన న్యాయవాదులు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తెలంగాణ హైకో ర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ పోలియో జడ్జి జస్టిస్‌ జె.శ్రీనివాస్‌ను కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మౌలిక సదుపాయాల కల్పన, నూతన కోర్టు భవనాల నిర్మాణం, న్యా యవాదులు, వ్యాజ్యదారులకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పా టు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో కొత్తగూడెం బార్‌ అసోసియేష న్‌ అధ్యక్షులు కిరణ్‌కుమార్‌ముధుల్కర్‌, ప్రధా న కార్యదర్శి మహేశ్‌ గాడిపెల్లి, కార్యవర్గ సభ్యులు కె.సంజీవరావు, షాజహాన్‌ పర్వీన్‌, జి.నాగరాజు, బి.దేవదాస్‌, డి.ప్రసాద్‌, ఉమ, ఉషారాణి, బార్‌ అసోసియేషన్‌ సలహాదారులు రమేశ్‌కుమార్‌మక్కడ్‌, న్యాయవాదులు పప్పుల ప్రసాద్‌, కె.రోహిత్‌ పాల్గొన్నారు.

ఏఐఏడబ్ల్యూ జిల్లా

అధ్యక్షుడిగా కనకయ్య

మణుగూరుటౌన్‌: తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా అన్నవరపు కనకయ్య, రేపాకుల శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మణుగూరు కిన్నెర కల్యాణ మండపంలో జరిగిన నాలుగో జిల్లా మహాసభల్లో ఈ ఎన్నిక జరగ్గా, గత కార్యక్రమాలను సమీక్షించుకున్నారు. అనంతరం నూతన కర్తవ్యాలను రూపొందించుకుని వాటి అమలుకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా మచ్చ వెంకటేశ్వర్లు, చిరంజీవి, నిమ్మల వెంకన్న, శెట్టి వినోద, ముదిగొండ రాంబాబు, గడ్డం స్వామి, సోలం నాగరత్నమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులుగా మరమ్మం చంద్రయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, ఆలేట్‌ కిరణ్‌, యాస నరేశ్‌, బందెల చంటితోపాటు మరో 26 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement