నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

నేత్ర

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

రామాలయానికి 15 కూలర్ల వితరణ

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి అమెరికాలో ఉంటున్న అజరాపు శేషగిరిరావు – సరోజిని దంపతులు రూ.3 లక్షలు విలువ చేసే 15 కూలర్లను గురువారం వితరణగా అందజేశారు. తొలుత వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాక ఈఓ కె.దామోదర్‌రావుకు కూలర్లు అప్పగించారు. కార్యక్రమంలో ఆలయన ఏఈఓ శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు లింగాల సాయిబాబా పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికీ తపాలా ఖాతా ఉండాలి

దుమ్ముగూడెం : తపాలా శాఖలో ప్రతి ఇంటికీ ఒక ఖాతాతో పాటు బీమా ఖాతా ఉండాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వీరభద్రస్వామి అన్నారు. మండలంలోని సీతారాంపురం బ్రాంచ్‌ పోస్టాఫీసులో గురువారం నిర్వహించిన డాక్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోస్టాఫీసులో అన్ని వర్గాల వారికి వివిధ రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి అయినా పోస్టాఫీస్‌ ద్వారా ఎలాంటి రుసుము చెల్లించకుండా డబ్బు తీసుకోవచ్చని చెప్పారు. తపాలా శాఖలో ఉన్నా సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తపాలా శాఖ భద్రాచలం నార్త్‌ సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ సూర్యప్రకాశ్‌రావు, భద్రాచలం హెడ్‌ పోస్ట్‌ మాస్టర్‌ రామ్మోహన్‌ రావు, ఐపీపీబీ మేనేజర్‌ సంజీవ్‌, ఎంఓ సుధీర్‌, బీపీఎం కోటా రెడ్డి, సీతారాంపురం, రేగుపల్లి సర్పంచ్‌లు పోడియం సుబ్బారావు, పూనెం విజయ్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం1
1/2

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం2
2/2

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Advertisement
 
Advertisement
Advertisement