సాఫీగా యూరియా విక్రయాలు
ఇల్లెందురూరల్: గతంలో మాదిరిగా క్యూలైన్లు లేకుండా జిల్లాలో యూరియా విక్రయాలు సాఫీగా సాగుతున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వేల్పుల బాబూరావు తెలిపారు. మండల, పట్టణ పరిధిలోని పలు యూరియా విక్రయ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి యాప్ వినియోగంపై వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో యాప్ ద్వారా 24,516 మంది రైతులకు 1.45 లక్షల యూరియా బస్తాలు విక్రయించామని చెప్పారు. పట్టాలు లేని రైతులతోపాటు కౌలు రైతులకు కూడా యాప్ ద్వారా అవసరం మేరకు యూరియా విక్రయిస్తున్నామని వివరించారు. యూరియా అవసరమైన రైతులు యాప్‌లో నమోదు చేసుకొని పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ సతీష్, ఏఈఓ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
డీఏఓ బాబూరావు వెల్లడి


