
నీటి చుక్క నిలవక..
మైదానాన్ని తలపిస్తున్న పెదవాగు ప్రాజెక్ట్
ఏటా వానాకాలం సీజన్‌లో సాగునీటితో నిండే పెదవాగు ప్రాజెక్ట్ ఈ ఏడాది మాత్రం పచ్చదనం పర్చుకుంది. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లివద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆనకట్టకు భారీ గండి పడి కోతకు గురైంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు ముందే ప్రాజెక్ట్‌ను తిరిగి నిర్మిస్తామని పాలకులు హామీ ఇచ్చారు. వరద ఉధృతికి ఆనకట్ట కొట్టుకుపోయినట్లే ఆ హామీ కూడా కొట్టుకుపోయి గోదారిలో కలిసింది. దీంతో ప్రాజెక్ట్‌లో సాగునీరు నిలవక పచ్చదనంతో నిండి క్రికెట్ మైదానంలా కనిపిస్తోంది. కాగా ఆయకట్టు రైతులు సాగునీటి కోసం మనోవేదన చెందుతున్నారు.
–అశ్వారావుపేటరూరల్

నీటి చుక్క నిలవక..