చీరాల: బాపట్ల జిల్లాలో నీట్–2026 ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం చీరాలలోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్‌లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పరిశీలించారు. నీట్‌కు మొత్తం 558 మందికిగాను 540 మంది హాజరు అయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో 14 రూమ్‌లో 336 మందికి గాను 321 మంది హాజరయ్యారు. ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్‌లో 10 రూమ్స్‌లో 222 మందికిగాను 219 మంది పరీక్ష రాశారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, తహసీల్దార్ గోపీకృష్ణ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ స్నేహలత పాల్గొన్నారు.


