ముగిసిన జాతీయ నాటకోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జాతీయ నాటకోత్సవాలు

May 4 2026 7:13 AM | Updated on May 4 2026 7:13 AM

ముగిసిన జాతీయ నాటకోత్సవాలు

చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్‌ గరల్స్‌ హైస్కూల్‌ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి శింగమనేని సుబ్బారావు కళావేదికపై సుమ్రిత యూత్‌ అసోసియేషన్‌, మధిర వారి యయాతి అనే పౌరాణిక నాటకం ప్రదర్శించారు. ప్రతిరోజూ రెండు నాటికలతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. వర్తమాన సమాజ స్థితిగతులకు నాటికలు అద్దంపట్టాయి. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహించారు. నాటకోత్సవాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన కళాంజలి కార్యదర్శి సాంబశివరావును అభినందిస్తూ గౌరవ సత్కారం నిర్వహించారు. కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్‌ తదితరులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement