అతిగా ఆలోచించకూడదు
ప్రశాంతంగా బతకాలి
ఒంటరితనాన్ని కోరుకుంటారు. అతిగా మద్యం తాగుతారు.
ప్రతీకారం తీర్చుకోవడంపైనే ఎక్కవగా మాట్లాడుతుంటారు.
తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవడం, అతిగా నిద్రపోవడం.
రాత్రిపూట నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచించడం.
అసలు దేనికీ స్పందించకపోవడం, చనిపోతున్నట్లు ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు.
ఆత్మహత్యకు పాల్పడటం, యత్నించడం, అందుకు ప్రోత్సహించడం చట్టప్రకారం నేరం. ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిపై భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)సెక్షన్ 226 కింద, ఆత్మహత్యకు ప్రోత్సహించే వారిపై సెక్షన్ 108 కింద కేసు నమోదు చేస్తారు.
మానసిక పరిపక్వత లేకపోవడం.. క్షణికావేశం.. ఇలా కారణం ఏదైతే ఏంటి... నిండు నూరేళ్లు బతకాల్సిన జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. వారిని నమ్ముకున్న వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఎవరైనా ఈ దిశగా ఆలోచించకుంటే ఆయా కుటుంబాలు ఒంటరిగా మిగిలిపోక తప్పదు.
01సిహెచ్‌ఆర్‌ఎల్110: సింబాలిక్
01సిహెచ్‌ఆర్‌ఎల్111: జనార్దన్
01సిహెచ్‌ఆర్‌ఎల్112: స్వాతికిరణ్
– బలవన్మరణాలతో కుటుంబాలు నాశనం
– చిన్న సమస్యలకే ఎక్కువగా కుంగుబాటు
– మృతుల్లో 20 – 50 ఏళ్ల లోపువారే అధికం
– కుటుంబసభ్యులకు తప్పని శోకం
మానసిక పరిపక్వత లేకపోవడం.. క్షణికావేశం.. ఇలా కారణం ఏదైతే ఏంటి... నిండు నూరేళ్లు బతకాల్సిన జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. వారిని నమ్ముకున్న వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఎవరైనా ఈ దిశగా ఆలోచించకుంటే ఆయా కుటుంబాలు ఒంటరిగా మిగిలిపోక తప్పదు.
వేటపాలెం:
మూడు రోజుల క్రితం రావూరిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాజేటి ప్రభాకర్, భార్య పార్వతి దంపతులు.. వారికి లేక లేక ఐదేళ్ల తరువాత పుట్టిన 13 నెలల చిన్నపాప ఉందని కూడా మర్చి పోయి ఇంట్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఏడాది వేటపాలెం పాకనాటి వీధిలో అద్దె కుంటూ 36 ఏళ్ల వ్యక్తి తన భార్య మరణించగా ఒక్కడే ఉంటున్నాడు. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆరు నెలలకే ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకొని మృతి చెందాడు. కొత్తపాలేనికి చెందిన 32 ఏళ్ల యువకుడు డిసెంబరు నెలలో ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. డిసెంబరు నెలలో దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురానికి చెందిన 25 ఏళ్ల యువకుడు సాప్టువేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయిన రెండేళ్లకే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకొని మృతి చెందాడు. గత ఏడాది నవంబరు నెలలో ఆణుమల్లిపేటకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయి రైలు కింద పడి చనిపోయాడు. ఇది జరిగిన రెండు రోజులకే ఇతనికి సంబంధించిన 30 ఏళ్ల మహిళ రామన్నపేట దగ్గరలో రైలు కింద పడి మృతి చెందింది. నియోజకవర్గ పరిధిలో 2024 –26 కాలంలో దాదాపు 15 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలనో, ఆర్థిక ఇబ్బందులనో, అనారోగ్యం, పరీక్షల్లో తప్పడం, ప్రేమ విఫలమవడం.. ఇలా రకరకాల కారణాలతో అతిగా ఆలోచించి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మానసికంగా కుమిలిపోతున్న వారిని కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించక పోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం కూడా ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యువత పరిపక్వత చెందని వయసులో తప్పుడు నిర్ణయాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
పరిష్కారం ఏంటి?
ఆత్మహత్య భావనలో ఉన్న వారిని ఒంటరిగా ఉంచకూడదు. వీతైనంత వరకు ఇంట్లో అందరి మధ్య ఉంచి కుటుంబ సభ్యులంతా వారిలో ధైర్యం నింపాలి. వీలైనంత వరకు ఆత్మహత్య భావన ఉన్నవారిని దానికి సహకరించే వస్తువులను అందుబాటులో లేకండా చూడాలి. ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు, బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ప్రక్రియలు శక్తివంతంగా ఉపయోగపడుతాయి. వీలైతే మానసిక వైద్య నిపుణులచే కౌన్సెలింగ్ ఇప్పించాలి.
మానసిక కుంగుబాటు లక్షణాలు..
ఆత్మహత్యకు పాల్పడేవారిని ముందే గుర్తించవచ్చని మానసిక నిపుణలు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు కొన్ని అసాధారణ లక్షణాలను కలిగి ఉంటారు.
– ఒంటరితనాన్ని కోరుకుంటారు. అతిగా మద్యం తాగుతారు.
– ప్రతీకారం తీర్చుకోవడంపైనే ఎక్కవగా మాట్లాడుతుంటారు.
– తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవడం, అతిగా నిద్రపోవడం.
– రాత్రిపూట నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచించడం.
– అసలు దేనికీ స్పందించకపోవడం, చనిపోతున్నట్లు ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు.
– ఆత్మహత్యకు పాల్పడటం, యత్నించడం, అందుకు ప్రోత్సహించడం చట్టప్రకారం నేరం. ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిపై భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)సెక్షన్ 226 కింద, ఆత్మహత్యకు ప్రోత్సహించే వారిపై సెక్షన్ 108 కింద కేసు నమోదు చేస్తారు.
అతిగా ఆలోచించకూడదు
– స్వాతికిరణ్, వైద్యాధికారి, వేటపాలెం
పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మారుతున్న విధానాలతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక ఎవరికి వారే కుమిలిపోతున్నారు. అతిగా ఆలోచించకుండా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇతరులతో పంచుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. పరిష్కార మార్గాలు చూసుకోవాలి కానీ ఆత్మహత్యలు పరిష్కారం చూపవు.
ప్రశాంతంగా బతకాలి
– జనార్దన్, ఎస్సై, వేటపాలెం
మానవ జీవతం అంటే ఒడిదొడుకులుంటాయి. కష్టసుఖాలను సమపాళ్లలో తీసుకోవాలి. దేనికీ బెదరకూడదు. కుంగిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మహిళలు ఇంట్లో సమస్యలను తలకెక్కించుకోకూడు. తేలిగ్గా తీసుకుని బతకడం నేర్చుకోవాలి. భర్త తప్పు చేస్తే పెద్దలకు చెప్పడం లేదా.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రేమించి మోసం చేస్తే వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు.
వేటపాలెం: మూడు రోజుల క్రితం రావూరిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాజేటి ప్రభాకర్, భార్య పార్వతి దంపతులు.. వారికి లేక లేక ఐదేళ్ల తరువాత పుట్టిన 13 నెలల చిన్నపాప ఉందని కూడా మర్చి పోయి ఇంట్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఏడాది వేటపాలెం పాకనాటి వీధిలో అద్దె కుంటూ 36 ఏళ్ల వ్యక్తి తన భార్య మరణించగా ఒక్కడే ఉంటున్నాడు. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆరు నెలలకే ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకొని మృతి చెందాడు. కొత్తపాలేనికి చెందిన 32 ఏళ్ల యువకుడు డిసెంబరు నెలలో ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. డిసెంబరు నెలలో దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురానికి చెందిన 25 ఏళ్ల యువకుడు సాప్టువేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయిన రెండేళ్లకే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకొని మృతి చెందాడు. గత ఏడాది నవంబరు నెలలో ఆణుమల్లిపేటకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయి రైలు కింద పడి చనిపోయాడు. ఇది జరిగిన రెండు రోజులకే ఇతనికి సంబంధించిన 30 ఏళ్ల మహిళ రామన్నపేట దగ్గరలో రైలు కింద పడి మృతి చెందింది. నియోజకవర్గ పరిధిలో 2024 –26 కాలంలో దాదాపు 15 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలనో, ఆర్థిక ఇబ్బందులనో, అనారోగ్యం, పరీక్షల్లో తప్పడం, ప్రేమ విఫలమవడం.. ఇలా రకరకాల కారణాలతో అతిగా ఆలోచించి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మానసికంగా కుమిలిపోతున్న వారిని కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించక పోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం కూడా ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యువత పరిపక్వత చెందని వయసులో తప్పుడు నిర్ణయాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.