వైభవంగా భావదేవుడి రఽథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా భావదేవుడి రఽథోత్సవం

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

● జనసందోహంగా మారిన రథం బజార్‌ ● ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు

బాపట్ల: భావపురి నడిబొడ్డున కొలువుతీరిన భావదేవుడి రథోత్సవం అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగింది. శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత శ్రీక్షీర భావనారాయణ స్వామి వారికి సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అలయఅర్చకులు, బ్రహ్మణుల సమక్షంలో కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారికి గరుడవాహనంపై పట్టణంలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భావదేవుడికి ఆలయకమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూనే ఉన్నారు. మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు బాపట్ల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు ఉత్సాహంగా పోటీ పట్టారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకున్న వారిలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, ఎస్పీ ఉమామహేశ్వర్‌, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement