చీరాల టౌన్: చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి తూమాటి చంద్రశేఖర నాయుడు అనుకున్నట్లే బదిలీ అయ్యారు. ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన ఆర్డీఓల బదిలీల్లో చీరాల ఆర్డీవో ఒంగోలు బదిలీ అయ్యారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చీరాలను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయగా మొట్టమొదటి ఆర్డీఓగా సరోజిని, ఎన్నికల సమయంలో అనంతరపురం నుంచి సూర్యనారాయణరెడ్డి, ఐదు రోజులు మాత్రం డి.అఖిల ఆర్డీఓగా పనిచేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోటోకాల్ అధికారిగా పనిచేస్తున్న తూమాటి చంద్రశేఖర నాయుడును చీరాల ఆర్డీఓగా నియమించడంతో ఇరవై నెలల పాటు చీరాలలో పనిచేశారు. ప్రస్తుతానికి చీరాల ఆర్డీఓగా ఎవ్వరినీ నియమించలేదు.


