యడ్లపాడు: మండల పరిధిలోని ఉన్నవలో పట్టపగలే గర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీ చేసినట్లు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెన్నుపాటి కృష్ణవేణి రోజువారీ కూలి పనులకు వెళ్లి, సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారా తలుపులు తీసి ఉండటంతో పాటు, లోపల ఉన్న లాకర్ కూడా తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. ఆందోళనతో లాకర్‌ను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 48 గ్రాముల బంగారం గొలుసు, చెవిపోగులు వంటి విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


