ముగ్గురు మహిళలు, ఒక నిర్వాహకుడు అరెస్ట్
గుంటూరు రూరల్: గుట్టు చప్పుడు కాకుండా స్పా సెంటర్‌లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నల్లపాడు పోలీస్‌స్టేషన్ పోలీసులు స్పా సెంటర్‌లపై మంగళవారం దాడులు నిర్వహించారు. నగరాలులోని లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ బృందం నల్లపాడు పోలీసులతో కలిసి దాడులు నిర్వహించగా స్పా సెంటర్ నిర్వాహకుడు, అతనితోపాటు ముగ్గురు మహిళలు, కండోమ్స్, ఒక వ్యక్తి, ఐదు సెల్‌ఫోన్‌లు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన వంశీ అనే వ్యక్తి స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.
నరసరావుపేట టౌన్ : చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2022వ సంవత్సరంలో మండలంలోని బసికాపురం గ్రామంలో వేంపూడి అనంతమ్మ మెడలోనీ బంగారు గొలుసును ముగ్గురు ఆగంతకులు బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్, ఉయ్యాల విష్ణు, పాలపర్తి ప్రవీణ్‌లను అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువడింది.
వెల్దుర్తి: మండలంలోని లోయపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. లోయపల్లి మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండకాసినంతరం, మధ్యాహ్నం 3గంటల తరువాత మాచర్ల నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది. మండలంలో మాత్రం దాని ప్రభావం కారణంగా పలుమార్లు ఉరుములు మెరుపులు వచ్చాయి. సాయంత్రం సమయంలో లోయపల్లి గ్రామంలో మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసె మీద పిడుగు పడటంతో గుడిసె పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. రోజువారీ పనులు చేసుకొని జీవించే వారు దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో నిలిచారు. తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ వచ్చి పరిశీలించి కుటుంబ సభ్యులకు రోజు వారీ నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


