మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

పోలీసుల అదుపులో కత్తితో హల్‌చల్‌ చేసిన టీడీపీ కార్యకర్త

ఉప్పుటూరు (చినగంజాం): మద్యానికి బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని ఉప్పుటూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పులి గోపి అందించిన సమాచారం ప్రకారం.. ఉప్పుటూరు గ్రామానికి చెందిన షేక్‌ నాజర్‌ వలి(20) తల్లిదండ్రులు విడిపోగా తల్లి వేరొక వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను అమ్మమ్మ దగ్గర ఉంటూ వెల్డింగ్‌ పనులు చేసుకుంటున్నాడు. మూడు నెలల క్రితం అతని తండ్రి మృతిచెందాడు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా మద్యానికి బానిసైన నాజర్‌వలి సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక వీఆర్వో, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి శవపంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు అవివాహితుడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో

నరాలశెట్టి ప్యానల్‌ విజయం

బాపట్ల: బాపట్ల కో ఆపరేటివ్‌ అర్బన్‌ ఎన్నికల్లో బ్యాంకు మాజీ చైర్మన్‌ నరాలశెట్టి ప్రకాశరావు ప్యానల్‌ విజయం సాధించింది. రెండు ప్యానల్స్‌ ఎన్నికల బరిలోకి దిగగా నరాలశెట్టి ప్యానల్‌ విజయం కై వసం చేసుకుంది. తొమ్మిది మంది డైరెక్టర్లు గెలుపొందారు. గెలుపొందిన వారిలో బండారు రవికుమార్‌(ఆర్మీ రవి), అనంత నగేష్‌బాబు, కోటి ఉమామహేశ్వరరావు, గర్నెపూడి వెంకటేశ్వరరావు, జూలకంటి వెంకటకృష్ణారావు, జోగి ఆనంద్‌, నరాలశెట్టి కృష్ణమూర్తి, పులిపాక రఘురాం, బాపట్ల జ్ఞాన సత్యప్రతాప్‌లు గెలుపొందారు. గెలుపొందిన వారు చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ను ఎన్నుకోకున్నారు.

చైర్మన్‌ రేస్‌లో బండారు రవికుమార్‌

చైర్మన్‌ రేస్‌లో బండారు రవికుమార్‌(ఆర్మీ రవి), వైస్‌ చైర్మన్‌ రేసులో కోటి ఉమామహేశ్వరరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు వీరి ఎన్నిక మంగళవారం జరగనుంది. డైరెక్టర్లను అభినందించిన వారిలో బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్‌, రిటైర్డ్‌ తహసీల్దార్‌ వల్లయ్య, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ బి.ఎస్‌.నారాయణభట్టు, సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు తాండ్ర సాంబశివరావు తదితరులు ఉన్నారు.

తాడేపల్లిరూరల్‌: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్‌ పెనుమాక గ్రామంలో కత్తి చేత్తో పట్టుకుని హల్‌చేసిన టీడీపీ కార్యకర్తను ఎట్టకేలకు తాడేపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ వీరేంద్రబాబు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండవల్లిలో నివాసముంటూ ప్రస్తుతం కృష్ణాయ పాలెంలో నివాసముంటున్న పెద్దపరం జ్యోతి అనే యువకుడికి కత్తిపట్టుకుని పెనుమాకలో హల్‌చల్‌ చేసిన కూనపురెడ్డి ప్రదీప్‌చంద్‌కు మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. శనివారం రాత్రి పెద్ద పరంజ్యోతి కూనపురెడ్డి ప్రదీప్‌కు ఫోన్‌ చేయగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీనిని ఆసరా చేసుకుని ప్రదీప్‌చంద్‌ ద్విచక్రవాహనంలో కత్తులు పెట్టుకుని పెనుమాక వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. జరిగిన సంఘటనపై పెద్దపరంజ్యోతి ఫిర్యాదు చేయడంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌, నార్త్‌జోన్‌ డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ప్రదీప్‌చంద్‌ ఉండవల్లి సెంటర్‌లో ఉండగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చామని, ఇతను రెండు కత్తులుకలిగి ఉన్నాడని, ఆ రెండింటిని కూడా మారణాయుధాలుగా నిర్ధారించి కేసు నమోదు చేశామని తెలిపారు. గతంలో ప్రదీప్‌పై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయని, అయినా ఇతని ప్రవర్తనలో మార్పు కనిపించలేదని, ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రదీప్‌పై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలాంటి వారు ఎవరైనా కత్తులు పట్టుకుని వీరంగం చేస్తే వెంటనే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

చోరీ కేసులో నిందితుడికి జైలు

తిరుపతి లీగల్‌: ఓ చోరీ కేసులో గుంటూరు జిల్లా తెనాలి, గంగానమ్మ పేటకు చెందిన పి. నాగ ఉమామహేశ్వరరావుకు రెండు నెలలు జైలు, రూ.వంద జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్‌ జడ్జి పి. కోటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీన తిరుమల సి ఆర్‌ ఓ ఆఫీసు హాల్లో నంద్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ప్యాంటు జేబులోని సెల్‌ ఫోను అపహరణకు గురైంది. అతని ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడు నాగ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

ఆయుధాల చట్టం కింద కేసు నమోదు

వివరాలు

వెల్లడించిన

సీఐ వీరేంద్ర

Advertisement
 
Advertisement
Advertisement