బాపట్ల టౌన్: క్రికెట్ బెట్టింగ్ లపై ఆదివారం జిల్లాలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల వివరాలను సోమవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం లో ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వివరించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు సిసిఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి చీరాల టూటౌన్, రూరల్, వేటపాలెం, చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాలను ఆదివారం అదుపులోకి తీసుకున్నామన్నారు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న 42 అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశామన్నారు. వారి వద్దనుంచి 25 మొబైల్ ఫోన్లు, రూ.51,400 నగదు, కారు, బైక్ సీజ్ చేయటం జరిగిందన్నారు. సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, చీరాల డిఎస్పి ఎండీ మోయిన్, బాపట్ల పట్టణ, చీరాల 2 టౌన్, రూరల్ సర్కిల్ సీఐ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.
42 మందిపై కేసులు నమోదు
25 మొబైల్ ఫోన్లు,
రూ.51,400 నగదు, కారు, బైక్ సీజ్


