ఆందోళన అవసరం లేదు | - | Sakshi
Sakshi News home page

ఆందోళన అవసరం లేదు

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

● కలెక్టర్‌, ఎస్పీ భరోసా ● కంట్రోల్‌ రూం 9493247765

బాపట్ల జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 96 పెట్రోల్‌ బంకులకు కొండపల్లి, ఒంగోలు ఆయిల్‌ డిపోల నుంచి నిరంతరాయంగా సరఫరా కొనసాగుతోందని వెల్లడించారు. ఇంధన పంపిణీ ప్రక్రియను రెవెన్యూ, సివిల్‌ సప్లయి శాఖల అధికారులు ప్రతి గంట పర్యవేక్షిస్తూ నివేదికలు సేకరిస్తున్నారన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి బంక్‌ను సీసీ కెమెరాల నిఘాలో ఉంచడంతోపాటు పోలీసు సిబ్బందిని కాపలాగా నియమించామని తెలిపారు. ఆక్వా, వ్యవసాయ అవసరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, రైతులు బంకుల వద్ద ఉన్న ఇంధనం పొందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బ్లాక్‌ మార్కెట్‌లో ఇంధనం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసి నిల్వలు చేయవద్దని కోరారు. సమస్యలు, ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సమాచారం కోసం 9493247765 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement