బాపట్ల పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు తోకల కృష్ణమోహన్ పేర్కొన్నారు. అవినీతిపై విచారణ చేపట్టాలని కోరుతూ సోమవారం బాపట్లలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వినతి పత్రం అందించారు. గ్రామాల్లో దొంగ హాజరు వేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకంలో పని ప్రదేశాల్లో కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కూడా అధికారులు పట్టించుకోవటంలేదన్నారు. ప్రతి పనిలోనూ అవినీతి జరుగుతుందని, వాస్తవంగా పేదలకు దక్కాల్సిన పనులు సక్రమంగా దక్కటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో యువత జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, స్టేట్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనిల్ కుమార్, స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ బట్టు అనిల్‌కుమార్, బాపట్ల నియోజకవర్గ పంచా యతీరాజ్ అధ్యక్షులు పిన్నబోయిన ప్రసాద్, పర్చూ రు నియోజకవర్గ పంచాయతీరాజ్ కార్యవర్గ సభ్యు లు వంకాయలపాటీ భాగ్యరావు, షేక్ బాబుల్లా, రేగులగడ్డ అరుణ్ పవార్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మువ్వల రాంబాబు, నరిశెట్టి శ్రీనివాసరావు, మిన్నకంటి శివ, దొడ్డ రవి, గోరంట్ల భాస్కరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


