ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఆర్‌ఐ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఆర్‌ఐ

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

బాపట్ల:బాపట్ల మున్సిపల్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ ఇమామ్‌ ఏసీబీ అధికారులకు చిక్కా రు. వివరాలు ఇలా ఉన్నాయి..చిన్నగంజాం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దేవరకొండ నాగేంద్రం, ఆమె కుమార్తె మౌనిక పట్టణంలోని సంజయ్‌గాంధీ కాలనీలో 2025లో రెండు ఇళ్లు కొనుగో లు చేశారు. ఆస్తులపై టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌, ప్రాపర్టీ పన్ను మార్పుల కోసం ఇమామ్‌ను సంప్రదించగా, గతంలోనే ఒక ఇంటికి బాధితుని భార్య నాగేంద్రంతో టైటిల్‌ ఇచ్చినందుకు రూ.25 వేలు చలానాలు, మరో రూ.25 వేలు లంచంగా స్వీకరించాడని బాధితులు తెలిపారు. మళ్లీ బాధితుని కుమార్తె మౌనిక పేరుతో టైటిల్‌మార్పు, పన్ను సవరణ కోసం రూ.60 వేలు డిమాండ్‌ చేయడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. చివరికి రూ.25వేలు ముందుగా ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఈ పరిస్థితుల్లో బాధితులు అవినీతి నిరో ధక శాఖ(ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వల పన్ని మౌనిక నుంచి రూ.25 వేలు లంచం స్వీకరిస్తున్న సమయంలోనే షేక్‌ ఇమామ్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, తదు పరి విచారణ చేపట్టారు. దాడిలో సీఐలు నాగరాజు, మన్మథరావు, సుబ్బారావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement