పర్చూరు(చినగంజాం): గ్రీవెన్స్‌లో ప్రజలు అందజేస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా అధికారులు సత్వరం పరిష్కరించేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ వీ వినోద్‌కుమార్ సూచించారు. నియోజకవర్గస్థాయిలో పర్చూరులోని కొల్లా వెంకటనారాయణ తులశమ్మ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో సోమవారం ప్రజా విజ్ఞప్తుల దినం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరు మండలాల ప్రజల అర్జీలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 368 మంది తమ సమస్యలతో కూడిన అర్జీలను కలెక్టర్ సమక్షంలో అందజేశారు. జేసీ భావన వశిష్ట, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎస్ లవన్న, డీఆర్వో, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.


