అవసరాల మేరకే ఇంధనం కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అవసరాల మేరకే ఇంధనం కొనుగోలు చేయాలి

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

అవసరాల మేరకే ఇంధనం కొనుగోలు చేయాలి

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 9493247765

బాపట్ల: జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట తెలిపారు. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా పరిస్థితిపై ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ ఎస్‌ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏమీ లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

సరఫరా మరింత పెంచుతున్నామని, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, పోలీస్‌ బృందాలను పెట్రోల్‌ బంకుల వద్ద పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు కంట్రోల్‌ రూమ్‌కు 9493247765 సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయం, ఆక్వా కల్చర్‌, పంట కోత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆయిల్‌ అవసరమైన రైతులు మండల స్థాయిలో తహసీల్దార్‌, గ్రామస్థాయిలో వీఆర్‌ఓలు దరఖాస్తులు చేసుకుంటే ర్మిషన్‌ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇంధన దుర్వినియోగం, బ్లాక్‌ మార్కెటింగ్‌, అక్రమ మార్పిడి వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బాపట్ల మండలం, కర్లపాలెం రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ను తనిఖీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట డీఎస్‌ఓ ఆర్‌.జమీర్‌ బాషా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement