రోడ్డు ప్రమాదాలు అరికట్టండి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలు అరికట్టండి

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

బాపట్ల: రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి పోలీసులు, రవాణా, అనుబంధ శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. రహదారుల భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఎం రాహత్‌ పథకానికి సంబంధించిన గోడపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. మే నెల ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరి చేస్తున్నామని ప్రకటించారు. డీటీఓ పరంధామరెడ్డి, ఆర్డీవోలు, డీఎస్పీలు, కమిటీలోని అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల రవాణా అరికట్టాలి

గంజాయి వంటి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. గంజాయి వంటి ముత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. వీటి నియంత్రణలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ఆరో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలు జరిగే 32 ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యువతను ప్రభావితం చేస్తున్న మత్తు పదార్థాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ చెప్పారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, కమిటీలోని జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌

సూర్యలంక బీచ్‌లో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అందుబాటులోకి తెస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. బీచ్‌ను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. పర్యాటకులకు కనువిందు చేసే పారా మోటరింగ్‌, జెట్టీలు, ఏటీవీ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పదిమంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్డీవో గ్లోరియా, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శేషగిరిరావు, అటవీ శాఖ అధికారులు, తదితరులు ఆయన వెంట ఉన్నారు.

నీటిని సంరక్షించాలి

జిల్లాలో ప్రతి నీటి బొట్టును సంరక్షించే దిశగా జలధార కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌ నుంచి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement