బైక్‌ దొంగతనం కేసులో 9 నెలలు జైలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగతనం కేసులో 9 నెలలు జైలు

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

బైక్‌ దొంగతనం కేసులో 9 నెలలు జైలు రేపల్లె: బైక్‌ దొంగతనానికి పాల్పడిన నిందితుడికి తొమ్మిది నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ రేపల్లె కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొల్లూరు మండలం సుగ్గులంక గ్రామానికి చెందిన శీలం మేఘనాథ్‌ అలియాస్‌ శివ అనే యువకుడు 2025 ఆగస్టు 14న రింగు రోడ్డు సెంటరులో బైక్‌ దొంగతనానికి పాల్పడ్డాడు. దీంతో తన ద్విచక్రవాహనం అపహరణకు గురైందని బాధితుడు బొర్రా కృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్‌ఐ ఎస్‌.రాజశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బైక్‌ అపహరించినట్లు రుజువు కావటంతో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.రాజశేఖర్‌ నిందితుడికి తొమ్మిది నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును పబ్లిక్‌ ప్రాజిక్యూటర్‌ కూరగంటి జ్యోతి వాదించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని అసోం వాసి మృతి మహిళపై పీడీ చట్టం అమలు ఫ్యాప్టో రిలే నిరాహార దీక్షల విజయవంతానికి పిలుపు ఉపాధి హామీ కూలీలకు గరిష్ట వేతనం అందాలి

చీరాల: గుర్తుతెలియని వాహనం ఢీకొని అసోం వాసి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి చీరాల 216 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అసోం రాష్ట్రానికి చెందిన బైగురైట్‌ (36), అతని స్నేహితులు పెరంబదూర్‌కు రైలులో వెళుతుండగా చీరాల సమీపంలో జారిపడ్డాడు. గాయాలైన అతడు ఈ విషయాన్ని స్నేహితులకు తెలియచేసి గురువారం రాత్రి 216 రహదారిలోకి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి వేళ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గాయాలై మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

రాజమండ్రి కేంద్ర కారాగారానికి

తరలింపు

నగరంపాలెం(గుంటూరువెస్ట్‌):గంజాయి, మాదక ద్రవ్యాల క్రయ, విక్రయాలు, అక్రమ రవాణా చేసే ఓ యువ మహిళపై పీడీ ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రయోగించి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తాడేపల్లి టౌన్‌లో ఉంటున్న 26 ఏళ్ల వి.నాగమణి గంజాయి క్రయ, విక్రయాలు, నిల్వలు, రవాణా చేస్తున్నట్లు పోలీసు లు గుర్తించారు. ఆమైపె నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ఆమైపె కేసులు నమోదు చేసినా ఆమెలో మార్పురాలేదు. ప్రజా భద్రత దృష్ట్యా ఆమెను నిర్బంధించడమే సరైన చర్యగా పోలీసులు భావించారు. దీంతో నాగమణిపై పీడీ చట్టం ప్రయోగించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ద్వారా తాడేపల్లి పీఎస్‌ సీఐ వీరేంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం అమలుకు ఉత్తర్వులు జారీ చేయగా, ఆమెను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మలి విడత ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26న గుంటూరు జిల్లా నుంచి రిలే నిరాహార దీక్షకు జిల్లా ఫ్యాప్టో నాయకులు, కార్యకర్తలు, ఫ్యాప్టో పోరుబాటకు మద్దతిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని జిల్లా ఫ్యాప్టో కార్యవర్గం పిలుపునిచ్చింది. సమావేశంలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌ యు.రాజశేఖర్‌, జి.దాసు, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యు లు ఎం.కళాధర్‌, షేక్‌ బాజీ,ప్యాప్టో జిల్లా నాయకులు జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి

నూజండ్ల: ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ప్రతి కూలీకి ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట వేతనం అందేలా చర్యలు చేపట్టాలని అఽందుకు అధికారులు సూచనలు అందించాలని డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి అదేశించారు. మండల పరిధిలోని టి.అన్నవరం, తెల్లపాడు, పమిడిపాడు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో జరిగిన పనులను వాటి కొలతలు పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలి వేతనం తక్కువగా వస్తుందని గరిష్టంగా అందేలా చూడాలని ఉపాధి కూలీలు ఆయనను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement