టౌన్‌ ప్లానింగ్‌ అస్తవ్యస్తం! | - | Sakshi
Sakshi News home page

టౌన్‌ ప్లానింగ్‌ అస్తవ్యస్తం!

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

ప్లాన్‌ అప్రూవల్‌ కావాలంటే కాసులు చెల్లించాల్సిందే!

అందులో ప్రభుత్వ ఖజానాకు ఎంత.... సొంత జేబుల్లోకి ఎంత?

రూల్స్‌ అతిక్రమిస్తే రూకలు వస్తాయనే భావన

బీపీఎస్‌ తో క్రమబద్ధీకరించుకోవచ్చని ఉచిత సలహాలు

పలు చోట్ల సెల్లార్లు ఇతర అవసరాలకు వినియోగం

చంద్రబాబు పాలన తీరుపై ప్రజల్లో చిన్నచూపు

మితి మీరిన రాజకీయ జోక్యం

చీరాల అర్బన్‌: చీరాల మున్సిపాల్టీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్లాన్‌ అప్రూవల్‌కు అదనపు పైసలు చెల్లించాల్సి వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో ప్రభుత్వ ఖజానాకు ఎంత, ఇతరుల జేబుల్లోకి ఎంత అనే కోణంలో చర్చించుకుంటున్నారు. చిన్న గృహాల నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు ప్లాన్‌ అప్రూవల్‌ కావాలంటే ప్రభుత్వ నిబంధనల మేరకు రుసుం చెల్లించాలి. ఆ నిబంధనలకు లోబడి నిర్మాణాలు జరగాలి. అందుకు ఎవరు వ్యతిరేకం కాదు. ఎక్కడన్నా ఒకటి అరా నిబంధనలను అతిక్రమిస్తే తరువాత ప్రభుత్వ పరంగా కల్పించే వెసులుబాటుతో రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకుంటారు.

అదే బీపీఎస్‌..... అయితే ..

చీరాలలో బీపీఎస్‌తో పాటు ఈపీఎస్‌, పీపీఎస్‌ రుసుంలు కూడా చెల్లించాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు. పలు చోట్ల సెల్లార్లును ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. వీటిపై అధికారులు చర్యలు చేపట్టక పోవటంతో ప్రజల్లో సంబంధీకులు చులకన అవుతున్నారు.

తొలుత అడ్డు చెప్పరు ...

తరువాత నిబంధనలు అంటారు

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే ప్లాన్‌ అప్రూవల్‌ సమయంలో చెప్పాలి. ఒక వేళ ఆన్‌లైన్‌లో అప్రూవల్‌ పొందారు. మా దృష్టికి రాలేదని చెప్పే అధికారులు, సిబ్బంది కనీసం నిర్మాణ ప్రాథమిక దశలో పక్కాగా చెప్పాలి. అది సరైనదైతే ఇబ్బంది లేదని, నిబంధనలు అతిక్రమిస్తే సక్రమం కాదని చెప్పాలి. అయితే అలా చెప్పరు. సగం, మూడొంతుల నిర్మాణం పూర్తయ్యాక నిబంధనల పేరుతో కొర్రీలు వేసి వ్యక్తి గత ప్రయోజనాలను ఆశిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటి వెనుక రాజకీయ కోణం ఉందనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

బీపీఎస్‌తో పాటు ఇపీఎస్‌, పీపీఎస్‌ చెల్లించాల్సిందే!

నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు కొన్ని సమయాల్లో ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. అదే బీపీఎస్‌ (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం). అయితే అంతకన్నా ముందు పీపీఎస్‌ (పొలిటికల్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌), ఇపీఎస్‌ (ఎంప్లాయీస్‌ పీనలైజేషన్‌ స్కీం) రుసుంలు కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పుకుంటున్నారు. దీంతో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోందని వాపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల వినియోగం

పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాల్లో సెల్లార్లను నిబంధనల మేరకు వినియోగించటం లేదు. ప్రధానంగా కొన్ని ఆసుపత్రులు, కొన్ని వ్యాపార సముదాలకు సంబంధించిన నిర్మాణాల్లో సెల్లార్లును నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. వీటిపై ఎందుకు చర్యలు చేపట్టరో సంబంధీకులకే తెలియాలి.

పైసా వసూళ్లు.. అందుకు కారణం

Advertisement
 
Advertisement
Advertisement