నీట్‌, పాలిసెట్‌ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నీట్‌, పాలిసెట్‌ పకడ్బందీగా నిర్వహించాలి

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

● జీవన భృతి కోసం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీలకు పంపిణీ చేసిన భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. ● జిల్లా ఉపాధి కార్యాలయం, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఇంకొల్లు మండలంలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ● ఈవీఎం గోదాములు భద్రంగానే ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

బాపట్ల: నీట్‌, పాలిసెట్‌ పరీక్షలు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. నీట్‌ మే నెల మూడో తేదీన జరగనుందని, హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకు కేంద్రంలో ఉండాలన్నారు.

భగీరథుడిలా పట్టుదలతో పని చేయాలి

భగీరథుని జీవిత చరిత్ర ఆదర్శమని, లక్ష్యాలను సాధించడానికి ఆయనలా పట్టుదలతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి సందర్భంగా గురువారం జిల్లా కలెక్టరేట్‌లో మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్‌ నివాళులర్పించారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement