అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు | - | Sakshi
Sakshi News home page

అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

11 కేంద్రాల్లో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష రేపల్లె: పాలిసెట్‌ 2026 పరీక్షకు బాపట్ల జిల్లా వ్యాప్తంగా మూడు పట్టణాలలో 11 కేంద్రాలను సిద్ధం చేసినట్లు రేపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ , పాలిసెట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2,825 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. రేపల్లెలో మూడు కేంద్రాలలో 740 మంది, బాపట్లలో మూడు కేంద్రాలలో 987 మంది , చీరాలలో 5 కేంద్రాలలో 1098 విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీన పరీక్ష ఉంటుందన్నారు. రేపల్లె గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాల (ఫోను నంబరు 89784 21087), చీరాల మహిళా డిగ్రీ కళాశాల (72073 43778), బాపట్ల పాలిటెక్నిక్‌ కళాశాల (94948 32424) కేంద్రాల్లో సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు.

గుంటూరు మెడికల్‌: ఆమె మరణించినా తన అవయవాలతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ నుంచి గుంటూరు ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్‌ వైద్యులు అవయవాలు సేకరించి పలువురికి అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. వివరాలు... బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన ఆకురాటి రత్నకుమారి (65) బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఈ నెల 19వ తేదీన గుంటూరు ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్‌లో అడ్మిట్‌ చేయించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోకపోవడంతో ఈ నెల 21న బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు నిర్ధారించారు. రత్నకుమారి కుటుంబసభ్యులకు జీవన్‌దాన్‌ ట్రస్టు కో ఆర్డినేటర్లు అవయవ దానం గురించి వివరించారు. వారు కూడా దానం చేయడానికి ముందుకు వచ్చారు. లివర్‌, ఒక కిడ్నీని గుంటూరు ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్‌లో, విజయవాడ విజయ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న రోగికి మరో కిడ్నీ, ఎల్‌వీప్రసాద్‌ కంటి ఆసుపత్రికి నేత్రాలు పంపించారు. తద్వారా ఐదుగురికి నూతన జీవితాలు ప్రసాదించారు. ఈ సందర్భంగా ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ అవయవదానం అత్యంత గొప్ప మానవ సేవ అని పేర్కొన్నారు.

సీఆర్డీఏ ఏసీగా బాధ్యతలు స్వీకరించిన కె.కార్తీక్‌

తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా కొల్లాబత్తుల కార్తీక్‌ బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 3వ ఫ్లోర్‌లోని ఆయన చాంబర్‌లో బుధవారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు తొలుత సీఆర్డీఏ కమ్యూనికేషన్స్‌ విభాగ జాయింట్‌ డైరెక్టర్‌ జి.రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్తీక్‌కు కమిషనర్‌ వి.విజయ రామరాజు, అడిషనల్‌ కమిషనర్‌ ఎ.భార్గవ తేజ, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్‌ బి. మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

గుంటూరులో మోడల్‌ లా సెట్‌

గుంటూరు లీగల్‌: ఈ నెల 26వ తేదీన ఏపీ బీసీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉచిత మోడల్‌ లా సెట్‌ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో అఫీషియల్‌ రిసీవర్‌ పి.టి.కోటేశ్వరరావు, మాజీ గవర్నమెంట్‌ ప్లీడర్‌ పోకల వెంకటేశ్వర్లు, అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ పీపీ పల్లపు కృష్ణ, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ కొండవీటి శ్రీనివాసరావులు ఆవిష్కరించారు. న్యాయవాది పల్లపు కృష్ణ మాట్లాడుతూ గుంటూరు శ్యామలానగర్‌లో ఉన్న మాంటిస్సోరి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ లో ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్‌ అసోసియేషన్‌ లైబ్రరీ సెక్రటరీ రాజేష్‌ లింగం, న్యాయవాదులు కె.వీరభాస్కర్‌, ఓర్సు జనార్దన్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement