అర్జీలను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను వెంటనే పరిష్కరించాలి

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

బాపట్ల పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ కంప్యూటర్‌ సెక్షన్‌ నుంచి ఫోన్‌ ద్వారా అర్జీదారులతో మాట్లాడారు. అర్జీ పరిష్కారమైందా వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో సమస్య పరిష్కారం చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ లవన్న తదితరులు పాల్గొన్నారు.

అడ్వెంచర్‌ టూరిజం అమలుకు అనుమతులు

బీచ్‌ల వద్ద సీఆర్‌జెడ్‌, పర్యావరణ నిబంధనలు అనుసరించి అడ్వెంచర్‌ టూరిజం అమలుకు అనుమతులు రావడం జిల్లా చరిత్రలోనే ప్రథమమని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధిపై స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సూర్యలంక బీచ్‌లో అడ్వెంచర్‌ టూరిజం స్పోర్ట్స్‌ వారంలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. నిర్వహణకు టెండర్లు పిలువగా ఐదుగురు ఆపరేటర్లు వచ్చారని తెలిపారు. బీచ్‌ల వద్ద జూన్‌ ఒకటో తేదీ నుంచి పూర్తిగా ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తామని తెలిపారు. పర్యాటక శాఖ అధికారి అలీ ఆస్గర్‌, బీచ్‌ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

స్వదేశీ దర్శన్‌ పనులు వేగంగా చేపట్టాలి

స్వదేశీ దర్శన్‌ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అనుబంధ శాఖల అధికారులు, ఎంఓయూలు కుదుర్చుకున్న సదరు పారిశ్రామికవేత్తలతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఆయన వీక్షణ సమావేశం ద్వారా భేటీ అయ్యారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement