న్యూస్‌రీల్
కాలం చెల్లిన ఫోన్ నంబర్లతో కాలయాపన
రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే సమాచారం అందించేందుకు వీలుగా జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్ ముందు బోర్డులను ఏర్పాటు చేశారు. బోర్డులపై నంబర్లకు కాలం చెల్లినా ఇప్పటికీ అవే స్టేషన్ ముందు దర్శనం ఇస్తున్నాయి. బోర్డులపై ఉన్న ఫోన్ నంబర్లు పనిచేయకపోతున్నప్పటికీ వాటి స్థానంలో కొత్త నంబర్లను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో జీఆర్‌పీ పోలీసులు ఉన్నారు. బాపట్ల రైల్వేస్టేషన్‌లోని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్ ముందు ఎస్‌హెచ్‌వో నంబర్ 89857 39848 అని రాసి ఉంది. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే ‘‘మీరు డయల్ చేసిన నెంబర్ తాత్కాలికంగా సేవల్లో లేదు... దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి’’ అనే సమాధానం వస్తోంది. డీఎస్‌ఆర్‌పీ నంబర్ 78826 19037కు ఫోన్ చేస్తే ‘‘మీరు డయల్ చేసిన నెంబర్ పనిచేయటం లేదు. దయచేసి నెంబర్ చెక్ చేసుకొని మళ్లీ ప్రయత్నించండి’’ అనే సమాధానం వస్తోంది. ఈ సమాధానాలు విన్న ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళితే అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి. దీంతో జీఆర్‌పీ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అధికారుల తీరు మారేలా చూడాలని, మనుగడలో ఉన్న ఫోన్ నంబర్లు బోర్డులపై ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
నిమ్మకాయల ధరలు
వైభవంగా చండీహోమం
బాపట్ల
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● కార్యాలయంలో ఎప్పుడు
చూసినా ఖాళీ కుర్చీలే దర్శనం
● మనుగడలో లేని ఫోన్ నంబర్లతో
దర్శనం ఇస్తున్న బోర్డులు
● ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి
విసుగు చెందుతున్న బాధితులు
రెప్పపాటులో రూ. 18 లక్షలు చోరీ
7
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8500, గరిష్ట ధర రూ.14,500, మోడల్ ధర రూ.11,000 వరకు పలికింది.
ఫిరంగిపురం: నుదురుపాడు కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శంకర జయంతిని పురస్కరించుకొని చండీహోమం నిర్వహించి పూర్ణాహుతి గావించారు.


