కర్లపాలెం: సాగు భూములలో పచ్చిరొట్ట పైర్లను పెంచటం ద్వారా భూసారం పెంచుకోవాలని బాపట్ల జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల తెలిపారు. కర్లపాలెం మండలంలోని చింతాయపాలెంలో ఏవో సుమంత్‌కుమార్ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ పంటలు పండించేందుకు కేవలం రసాయనిక ఎరువులనే వినియోగించటంతోపాటు పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులు వినియోగించాలని రైతులకు తెలిపారు. జీవన ఎరువులైన అజటో బాక్టీరియం, ఆజోస్పిరిల్లం వినియోగించటం ద్వారా రసాయనిక ఎరువుల వినియోగాన్ని బాగా తగ్గించుకోవచ్చునని చెప్పారు. 15 నుంచి 30 లోపు రకాల విత్తనాలు కలిగిన కిట్‌లు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అనంతరం కర్లపాలెంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.


