జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడైన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి మహోత్సవ కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అధికారులతో కలసి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పమాలలతో నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని తెలుగు తల్లి గేయంతో ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ దళిత కులం నుంచి తొలి రాజకీయ నాయకుడు, భారత ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. మంత్రి పదవులను సమర్థంగా నిర్వహించారని, మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో హరిత విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదరికం నుంచి వచ్చిన జగ్జీవన్‌రామ్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, భారతదేశ సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి రాజాదెబోరా, డీఆర్‌డీఏ పీడీ సింగయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ నాయకులు చార్వాక, ఎన్ మోహన్ కుమార్ ధర్మ, పల్నాటి శ్రీరాములు, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.


