చైన్‌ స్నాచర్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచర్‌ అరెస్టు

Mar 9 2026 7:26 AM | Updated on Mar 9 2026 7:26 AM

వేటపాలెం: రాష్ట్రవ్యాప్తంగా చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ శేషగిరిరావు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన గరికే సుబ్బరాజు అలియాస్‌ బ్లేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలనే టార్గెట్‌ చేసి వారి మెడల్లో ఉన్న బంగారు నగలను లాక్కొని పారిపోయాడన్నారు. ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగా 22 చైన్‌ స్నాచింగ్‌ కేసులు వివిధ పోలీసుస్టేషన్‌లో నమోదై ఉన్నాయన్నారు. జనవరి 24వ తేదీన వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరపట్నంకు చెందిన సిల్లపల్లి సామ్రాజ్యం తన ఇంటి ఆవరణలో ఉండగా 4 సవర్ల బంగారపు తాడు, మంగళ సూత్రం దొంగలించుకొని పారిపోయాడు. దీనిపై అదే రోజు బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుని కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పట్టుకున్నామన్నారు. ఆదివారం దేశాయిపేటలో తిరుగుతున్న నిందితుడిని పట్టుకొని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకొన్నాడు. అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 36 గ్రాముల బంగారు తాడు, సూత్రం, 16 గ్రాముల బంగారు చైన్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం 52 గ్రామలు బంగారం అని, దీని విలువ రూ.7.80 లక్షలుగా ఉంటుందని తెలిపారు. నిందితుడు చిన్నతనం నుంచే పేకాట, మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటు పడి రాష్ట్ర వ్యాప్తంగా చైన్‌స్నాచింగ్‌లు చేస్తూ తిరుగుతుంటాడని తెలిపారు. గ్రామాల్లో మోటార్‌ బైక్‌ను దొంగతనం చేసి దానిపై తిరుగుతూ ఒంటరి మహిళ మెడలో చైన్‌లు లాక్కొని వెళుతుంటాడు. నెల వ్యవధిలోని కేసును ఛేదించిన ఎస్సై జనార్దన్‌, క్రైమ్‌ పార్టీ సిబ్బంది జీ ప్రసాద్‌, బీ బాలచంద్ర, టీ శ్రీనివాసరావు, బీ అచ్చయ్యని అభినందించారు.

52 గ్రాముల బంగారు నగలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement