అనుక్షణం అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

అనుక్షణం అప్రమత్తత అవసరం

Oct 29 2025 7:45 AM | Updated on Oct 29 2025 7:45 AM

అనుక్

అనుక్షణం అప్రమత్తత అవసరం

అనుక్షణం అప్రమత్తత అవసరం నిజాంపట్నం హార్బర్‌లో 8వ నంబరు ప్రమాద హెచ్చరిక రేపల్లె: మోంథా తుపాను నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్‌లో మంగళవారం 8వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మంగళవారం రేపల్లె నియోజకవర్గంలో వర్షంతో కూడిన గాలులు వీయటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారుల హెచ్చరికలతో అత్యవసర పనులు ఉన్న వారు మాత్రమే బయటకు వచ్చారు. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి. కరిమబ్బులను చూసి రైతుల్లో కలవరం మొదలైంది. తాము కష్టించి సాగు చేసిన పంట నష్టపోతామని భయాందోళనలు చెందుతున్నారు.

జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌

బాపట్ల టౌన్‌: తుపాను నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కార్యాలయంలోని కంట్రోల్‌రూమ్‌ అధికారుల వరకు ప్రతి ఒక్కరు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. మంగళవారం జిల్లాలోని అధికారులు, కమాండ్‌ కంట్రోల్‌ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే సిబ్బంది అప్రమత్తమై సహాయకచర్యలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా మూడు సబ్‌ డివిజన్లలో, ప్రధాన కార్యాలయంలో, సూర్యలంక, నిజాంపట్నం ప్రాంతాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో 83338 13228 నంబరుకు ఫోన్‌ చేస్తే తక్షణ సహాయసేవలు పొందవచ్చని తెలిపారు. అత్యవసర సమయంలో 112కు ఫోన్‌ చేస్తే అధికారులు స్పందిస్తారన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని జిల్లా ఎస్పీ తెలిపారు.

ముఖ్యమైన ఫోను నంబర్లు ఇవే..

బాపట్ల పోలీస్‌ ప్రధాన కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌లో డీఎస్పీ జగదీష్‌ నాయక్‌ – 89787 77821, చీరాల సబ్‌డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌లో డీఎస్పీ ఎం.డి. మోయిన్‌ – 91211 02140, వి. నాగశ్రీను (నోడల్‌ అధికారి) – 91211 04793 , బాపట్ల సబ్‌డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌లో డీఎస్పీ జి. రామాంజనేయులు – 94407 96165 , ఎం. విజయ్‌ కుమార్‌ (నోడల్‌ అధికారి) – 89787 77298 , రేపల్లె సబ్‌ డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌లో డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు – 83338 13225 , పి.రవి ప్రసాద్‌ (నోడల్‌ అధికారి) – 90320 30919 , ఎస్‌బీ–1 ఇనన్‌స్పెక్టర్‌ జి. నారాయణ – 83338 13224, ఎస్‌బీ–2 ఇన్‌స్పెక్టర్‌ ఎం. రాంబాబు – 89787 77261, సూర్యలంక కంట్రోల్‌ రూమ్‌ – 93929 14737, నిజాంపట్నం కంట్రోల్‌ రూమ్‌ 93929 14739 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేస్తే సహాయక చర్యలు అందిస్తారన్నారు.

అనుక్షణం  అప్రమత్తత అవసరం 1
1/1

అనుక్షణం అప్రమత్తత అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement