విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టీల్ ప్లేట్లు పంపిణీ చే
రొంపిచర్ల: మండలంలోని పాఠశాలకు టెల్సా సంస్థ రూ.6,51,500లతో సమకూర్చిన నోట్ పుస్తకాలు, స్టీల్ ప్లేట్లు, జామెంట్రీ బాక్స్‌లను గురువారం సంస్థ ప్రతినిధి కరిముల్లా, మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మేశ్వరరావుకు అందజేశారు. బ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు టెల్సా అందించిన నోట్ బుక్స్, జామెంట్రీ బాక్స్‌లు, స్టీల్ ప్లేట్లను అన్ని పాఠశాలలకు అందజేస్తామన్నారు. టెల్సా సంస్థ ప్రతినిధి కరిముల్లా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎం.సుభాని, పి.రాజేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బగళాముఖి సేవలో బాలస్వామీజీ
చందోలు(కర్లపాలెం): ప్రసిద్ధిగాంచిన చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని పెనుగొండ వాస వీ పీఠాధిపతులు శ్రీబాలస్వామీజీ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేనేజర్ నరసింహమూర్తి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్‌రెడ్డి ఆలయ పూజారులతో కలసి పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవా రి దర్శనం అనంతరం బాలస్వామీజీ మాట్లాడుతూ శ్రీదేవి నవరాత్ర దీక్ష అనంతరం బగళా ముఖి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చి నట్లు తెలిపారు. అనంతరం స్వామీజీకి ఆల య మేనేజర్, అభివృద్ధి కమిటీ చైర్మన్, పూజా రులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
చిలకలూరిపేట టౌన్: ఇద్దరు యువకులు చేసిన దాడిలో ఆర్టీసీ డ్రైవర్ ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చిలకలూరి పేట పట్టణంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తెనపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ఉయ్యాల శ్రీనివాసరావు తన విధుల్లో భాగంగా తిరుపతి నుంచి వయా చిలకలూరిపేట మీదుగా సత్తెనపల్లి వెళ్లే క్రమంలో బస్సును స్థానిన ఎన్‌ఆర్‌టీ సెంటర్లో నిలుపుదల చేసి పక్కన ఉన్న టీస్టాల్‌లో టీ తాగుతున్నారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు డ్రైవర్‌పై పడ్డారు. వారిని కసురుకున్నందుకు వారిద్దరు వాగ్వాదానికి దిగి డ్రైవర్‌పై దాడి చేశారు.
అక్రమంగా నిర్వహిస్తున్న మార్కెట్‌ను సీజ్ చేయాలి
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : బుడంపాడు బైపాస్ సర్వీస్ రోడ్డులో అక్రమ లే అవుట్‌లో ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహా హోల్‌సేల్ కూరగాయాల మార్కెట్‌ను వెంటనే సీజ్ చేయాలని కొల్లి శారదా మార్కెట్ నూతన లీజు దారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కౌన్సిల్ సమావేశం వద్ద బ్యానర్ పట్టుకుని తమ నిరసన తెలియజేశారు.
నేడు ప్రత్యేక పీజీఆర్‌ఎస్
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్
బాపట్ల: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు, గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులు తమ సమస్యలను ప్రతి నెలా మాదిరిగానే నాలుగో శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగే కార్యక్రమంలో తెలుపవచ్చని చెప్పారు.
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారి మండల దీక్ష మాలధారణ కార్యక్రమం డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ తెలిపారు. డిసెంబర్ 21తో ముగుస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 10 వరకు అర్ధమండల దీక్ష, జనవరి 16 నుంచి 20 వరకు మాలధారణ నిర్వహిస్తారని పేర్కొన్నారు.
విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టీల్ ప్లేట్లు పంపిణీ చే
విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టీల్ ప్లేట్లు పంపిణీ చే
విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టీల్ ప్లేట్లు పంపిణీ చే


