● నమ్మండి.. ఇది రాజధాని రోడ్డు..
తాడికొండ: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన స్మార్ట్ రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పే కూటమి ప్రభుత్వం.. అమరావతికి వెళ్లే రహదారిని మాత్రం మరమ్మతులు కూడా చేయించలేకపోతోంది. గుంటూరు నుంచి తుళ్ళూరు వెళ్లే ఈ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ప్రమాదాలకు నిలయమైంది. దీని దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ఇటీవల మాట్లాడినా పట్టించుకునే వారే కరువయ్యారు. పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతోంది. పెదపరిమి– తుళ్ళూరు గ్రామాల మధ్య ఉదయం ఓ ఇసుక లారీ రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో బయటకు లాగారు. సాయంత్రం మరో లారీ గుంతలలో అదుపుతప్పి పక్కకు బోల్తా కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. కనీసం ఆటోలు సైతం ప్రయాణించలేని దుస్థితిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యను అసెంబ్లీలో ఎమ్మెల్యే
లేవనెత్తినా మరమ్మతులు శూన్యం
● నమ్మండి.. ఇది రాజధాని రోడ్డు..


