అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు

Jul 9 2025 6:49 AM | Updated on Jul 9 2025 6:49 AM

అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు

అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు

లక్ష్మీపురం: ఈ నెల 2వ తేదీన కొబాల్డ్‌పేటలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు అదృశ్యం అయిన కేసును పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఛేదించారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టాభిపురం సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కోబాల్డ్‌పేట 6వ లైనులో నివాసం ఉండే సయ్యద్‌ సందానీకి, అతని భార్య కరీమూన్‌కు కొంత కాలంగా చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే భనవంలో పై పోర్షన్‌లో నివాసం ఉండే షేక్‌ చిన్న బాజీకి, ఆమె భార్య రజియాకు కూడా మనస్పర్థలు ఉన్నాయి రజియా చెల్లెలు సైదాబీకూడా తన భర్తతో గొడవల కారణంగా వచ్చి వీరి వద్దనే తన కుమార్తెతో ఉంటోంది. కరీమూన్‌, రజియా, సైదాబీలు ఎక్కడికై నా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ నెల 2వ తేదీన బయలుదేరారు. కరీమూన్‌ తన ముగ్గురు మగ పిల్లలను, రజియా తన ముగ్గురు పిల్లలను, సైదాబీ తన కుమార్తెను వెంట బెట్టుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం ప్రత్యేక బృందాన్ని కేటాయించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తన సిబ్బందితో ఏఎస్సై ఆంటోని, హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాదరావు, కోటేశ్వరరావు, నరసింహారావు, మాణిక్యరావుల సహాయంతో హైదరాబాద్‌ చర్లపల్లి ప్రాంతంలో వీరు ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement