అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం.. | - | Sakshi
Sakshi News home page

అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం..

May 30 2025 1:34 AM | Updated on May 30 2025 1:34 AM

అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం..

అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం..

సత్తెనపల్లి: ‘‘మీరేమీ ఇబ్బంది పడవద్దు, భయపడ వద్దు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీకు అండగా ఉన్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం..’’ అంటూ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వారు గురువారం పర్యటించారు. ఏడాది క్రితం టీడీపీ, జనసేన నేతల దాడులు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్‌, వైఎస్సార్‌ సీపీ క్రియాశీలక నాయకుడు కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యా న్ని కలిగించారు. మృతుడు తండ్రి, పాకాలపాడు పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. అనంత రం వారు మాట్లాడుతూ.. జూన్‌ 3న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల గ్రామా న్ని సందర్శిస్తారని చెప్పారు. కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పిస్తారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, డాక్టర్‌ గజ్జల నాగభూషణ్‌ రెడ్డి, డీఆర్‌యూసీసీ మెంబర్‌ చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ నాగుర్‌ మీరాన్‌, సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, ఎంజే ఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ఇందూరి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు షేక్‌ మౌలాలి(సత్తెనపల్లి టౌన్‌), వేపూరి శ్రీనివాసరావు (రాజుపాలెం), భవనం రాఘవరెడ్డి (నకరికల్లు), నక్కా శ్రీను(ముప్పాళ్ల), వైఎస్సార్‌ సీపీ నాయకులు బండి కోటినాగిరెడ్డి, ఏకుల మత్తయ్య, పల్లె గాబ్రియేలు, కోట ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, లేళ్ళ అప్పిరెడ్డి, నేతల బృందం రెంటపాళ్ళ ఉపసర్పంచ్‌ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ జూన్‌ 3న రెంటపాళ్ళకు వైఎస్‌ జగన్‌ రాక నేపథ్యంలో రూట్‌మ్యాప్‌ పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement