మహంకాళీ అమ్మ వారికి లక్ష రూపాయల విరాళం | - | Sakshi
Sakshi News home page

మహంకాళీ అమ్మ వారికి లక్ష రూపాయల విరాళం

May 12 2025 12:53 AM | Updated on May 12 2025 12:53 AM

మహంకా

మహంకాళీ అమ్మ వారికి లక్ష రూపాయల విరాళం

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసిఉన్న మహంకాళీ అమ్మ వారి దేవస్థానం అభివృద్ధికి పెదకాకానికి చెందిన కె.శ్రీహరిబాబు, నాగేశ్వరి దంపతులు లక్ష రూపాయలను విరాళంగా ఆదివారం అందజేశారు. దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు అమ్మవారి చిత్రపటం బహూకరించారు.

సాయానికి వెళ్లి.. మృత్యు ఒడిలో చేరిన రైతు

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న

కుటుంబ సభ్యులు

పెదకూరపాడు: తోటి రైతుకు సాయంగా వెళ్లి ప్రమాదానికి గురైన రైతు కథ విషాదంగా ముగిసింది. చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని అచ్చంపేట నుంచి పెదకూరపాడు తీసుకొచ్చే క్రమంలో లగడపాడు వద్ద ప్రమాదం జరిగింది. ఇందులో తీవ్ర గాయాలైన పెదకూరపాడు వాసి గోరంట్ల బ్రహ్మయ్య (33)గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ‘‘మాతృ దినోత్సవం రోజే నా మాంగల్యం తీసుకెళ్లావా... దేవుడూ.. నీకు కనికరం లేదా ! మంచానికే పరిమితమైన అత్తామామలు, బిడ్డలను ఎలా సాకాలయ్యా !’’ అంటూ భార్య మల్లిక విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ‘‘సాయానికి వెళ్లి సామి దగ్గరకు వెళ్లావా నాన్నా !’’అంటూ కుమారుడు మణికంఠ, కుమారై సుక్షలు గుండెలు అవిసేలా విలపించారు. అందరితో కలవిడిగా తిరిగే బ్రహ్మయ్య మృతితో పెదకూరపాడులో విషాద ఛాయాలు అలుముకున్నాయి.

ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ రవికుమార్‌

తెనాలి రూరల్‌: ఆంఽధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ అధ్యక్షుడి డాక్టర్‌ రవికుమార్‌ వేమూరు నియమితులయ్యారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఆదివారం జారీ చేసింది. తెనాలికి చెందిన డాక్టర్‌ రవికుమార్‌ 40 ఏళ్లు అమెరికాలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పని చేసి, స్వదేశానికి వచ్చారు. 2015 టీడీపీ హయాంలో ప్రవాస తెలుగు వ్యవహారాల సలహాదారుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.30 అడుగుల వద్ద ఉంది. ఇది 137.3416 టీఎంసీలకు సమానం.

మహంకాళీ అమ్మ వారికి  లక్ష రూపాయల విరాళం 
1
1/3

మహంకాళీ అమ్మ వారికి లక్ష రూపాయల విరాళం

మహంకాళీ అమ్మ వారికి  లక్ష రూపాయల విరాళం 
2
2/3

మహంకాళీ అమ్మ వారికి లక్ష రూపాయల విరాళం

మహంకాళీ అమ్మ వారికి  లక్ష రూపాయల విరాళం 
3
3/3

మహంకాళీ అమ్మ వారికి లక్ష రూపాయల విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement