Weekly Horoscope: May 28 To June 3, 2023 In Telugu; ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త అందుతుంది, ధనలాభం - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త అందుతుంది, ధనలాభం

Published Sun, May 28 2023 6:53 AM

Weekly Horoscope Telugu 28-05-2023 To 03-06-2023 - Sakshi

మేషం..
అనుకున్న ఆదాయం లభిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. సోదరులతో కలహాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం..
కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. ప్రత్యర్థులను మార్చడంలో సఫలమవుతారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. తెలుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం..
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు సైతం సహకరించడం విశేషం. ఆత్మీయులు  చేదోడుగా నిలుస్తారు. ప్రతిభను చాటుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. బంధువులతో సఖ్యత ఏర్పడతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి ఆరాధన మంచిది.

కర్కాటకం..
కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఊహించని పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం..
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఎంతోకాలంగా నిరీక్షణ ఫలించి ఆప్తులు దగ్గరవుతారు. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. శత్రువులకు కూడా సహాయం అందించి మంచితనాన్ని చాటుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు,గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం  ప్రారంభంలో దుబారా వ్యయం. మానసిక అశాంతి. ఎరుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

కన్య..
యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి.

తుల..
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో కలహాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు.  గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. నలుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం..
చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విశేషంగా కలిసివస్తుంది. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయం దర్శించండి.

ధనుస్సు..
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. సేవాకార్యక్రమాలలో  పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తుల కలలు ఫలిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం..
బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన బాకీలు కొన్ని అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి.  సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం..
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు, ఇంక్రిమెంట్లు. కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తోత్రాలు పఠించండి.

మీనం..
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. సోదరులు, సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. కళాకారుల యత్నాలు సఫమవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివనామ స్మరణ మంచిది.

Advertisement
 
Advertisement
 
Advertisement