Weekly Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది

Published Sun, May 26 2024 6:22 AM

Weekly Horoscope Telugu 26-05-2024 To 01-06-2024

మేషం
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు.  శివాష్టకం పఠించండి.

వృషభం
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సూచనల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం  ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.

మిథునం
రుణాలు తీరి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం మ«ధ్యలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, లేత ఎరుపు రంగులు. శివారాధన మంచిది.

కర్కాటకం
ప్రారంభంలో చికాకులు, సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యం, ఓర్పుతో అధిగమిస్తారు. మీపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత చురుగ్గా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆస్తి వివాదాలు. నేరేడు, చాక్లెట్‌ రంగులు.  అన్నపూర్ణాష్టకం పఠించండి.

సింహం
పనులలో ఆటంకాలు తొలగుతాయి. పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు  ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులు మారతారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. తెలుపు, గులాబీ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

తుల
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆర్థికంగా మరింత బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు దక్కుతాయి. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు  మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించవచ్చు. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, గులాబీ రంగులు.  గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసిరావు. నిర్ణయాలు పునఃసమీక్షిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు. వేడుకలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.  ఇంటాబయటా ఒత్తిడులు. భాగస్వామ్య వ్యాపారాలలో సామాన్యలాభాలు.  ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు పదవులు అసంతృప్తి కలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప «దనలాభం. తెలుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు
వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. ఎరుపు, లేతనీలం రంగులు. విష్ణుధ్యానం చేయండి.

మకరం
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల ఆప్యాయత పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు.  అంగారకస్తోత్రాలు పఠించండి.

కుంభం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీలోని సేవాగుణం వెలుగులోకి వస్తుంది. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. తీర్థయాత్రలు చేస్తారు. ఒక సమాచారం విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. నీలం, ఎరుపు రంగులు. శివారాధన మంచిది.

మీనం
ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement