Weekly Horoscope Telugu: 25-12-2022 T0 31-12-2022 - Sakshi
Sakshi News home page

వారఫలాలు: 25 డిసెంబర్‌ నుంచి 31 డిసెంబర్‌ 2022 వరకు

Published Sun, Dec 25 2022 6:41 AM

Weekly Horoscope Telugu 25-12-2022 T0 31-12-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు, సంభాషణలు జరుపుతారు. ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో ఒక మిత్రుని సహాయం స్వీకరిస్తారు. వ్యాపారాలలో మరింత ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు అనుకూల ఫలితాలు. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సకాలంలో  విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయవేత్తలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సన్నిహితుల సలహాలతో అతిముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. కళారంగం వారి కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.  గృహం, వాహనాలు కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ప్రగతి. వారం చివరిలో  వ్యయప్రయాసలు.  ఆరోగ్య సమస్యలు. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితిపై పూర్తి  సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం  నెరవేరుతుంది.  స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో మీ ఆధిపత్యాన్ని చాటుకుంటారు. కళారంగం వారి సుదీర్ఘ యత్నం ఒకటి ఫలిస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సహచరుల సాయం అందుతుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు ఎట్టకేలకు  పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు.  ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు, శ్రమకు తగిన ఫలితం దక్కించుకులేరు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని పనులలో ప్రతిష్ఠంభన వల్ల నిలిచి పోతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం. వ్యాపారాలు మరింత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పనిఒత్తిడులు ఉండవచ్చు. కళారంగం వారి యత్నాలలో ఆటంకాలు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కుటుంబంలో సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ వేటలో విజయం. పరిస్థితులు  మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి.  ఉద్యోగాలలో  ఒత్తిడుల నుండి బయటపడతారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభించవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరతాయి. విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు  గృహ నిర్మాణాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి. కళారంగం వారి యత్నాలు సఫలం. తెలుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు మరింత సంతృప్తినిస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారనుంది. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో నెలకొన్న సమస్యలు, ఇబ్బందులు తీరతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చాలవరకూ తగ్గుతాయి. కళారంగం వారికి అన్ని విధాలా విజయవంతంగా నడుస్తుంది. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.  

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
నిరుద్యోగుల శ్రమ ఫలించి ఉద్యోగాలు సాధిస్తారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని సమస్యలు  తీరి ఒడ్డున పడతారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీదారికి తెచ్చుకుంటారు. ఆర్థికంగా మరింత బలపడతారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.  పారిశ్రామికవర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు
 

Advertisement
 
Advertisement
 
Advertisement