ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 20-07-2025 To 26-07-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Jul 20 2025 12:50 AM | Updated on Jul 20 2025 10:27 AM

Weekly Horoscope In Telugu From 20-07-2025 To 26-07-2025

మేషం...
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శివపంచాక్షరి పఠించండి.

వృషభం....
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వాహనయోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం...
ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. భూవివాదాలు నెలకొంటాయి. ప్రముఖులతో చర్చలు ఫలించవు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో  ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. నేరేడు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం...
అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం...
కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, గులాబీ రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

కన్య...
నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం  ప్రారంభంలో వివాదాలు. అనుకోని ఖర్చులు. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల...
ఆర్థిక వ్యవహారాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో అకారణంగా విభేదాలు. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆరోగ్యం చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. వారం చివరిలో అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం....
అనుకోని ఖర్చులు ఎదురై అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు.  శివాష్టకం పఠించండి.

ధనుస్సు...
అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహాన్నిస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం...
వీరికి అన్నింటా విజయాలే. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారమవుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు ర ంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కుంభం...
అనుకున్న పనులు నత్తనడకన  కొనసాగుతాయి. బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు.  వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో విందువినోదాలు. ఉద్యోగలాభం. నేరేడు, గులాబీ రంగులు.  గణేశ్‌ను పూజించండి.

మీనం...
వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. మిత్రులతో కలహాలు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. శ్రమకు తగిన ఫలితం రాక డీలా పడతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి యత్నాలలో అవాంతరాలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement