Weekly Horoscope Telugu: ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు, ఆకస్మిక ధనలాభం

Weekly Horoscope Telugu 04-06-2023 To 10-06-2023 - Sakshi

మేషం
నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. మీఖ్యాతి మరింత విస్తరిస్తుంది. మీ మాటే చెల్లుబాటు కాగలదు. ముఖ్య నిర్ణయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

వృషభం
కొత్త పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి., ఉద్యోగాలలో చిక్కులు అధిగమించి సత్తా చాటుకుంటారు. విద్యార్థులు లక్ష్యాల సాధనలో విజయం సాధిస్తారు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు అనుకూలం.తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాల పఠనం ఉత్తమం.

మిథునం
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఎటువంటి పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలోని ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలలో మరింతగా లాభాలు దక్కుతాయి.  ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. కళారంగం వారు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు, మనోచింతన. నీలం, నేరేడు రంగులు అనుకూలం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామాలు పఠించండి.

కర్కాటకం
ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు, చికాకులు తొలగుతాయి.  ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరుగవచ్చు. అందరిలోనూ సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, తెలుపు రంగులు అనుకూలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం
వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు.  ఆర్థిక పరిస్థితి కాస్త నయమనిస్తుంది. రుణభారాలు తగ్గే అవకాశం. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక ప్రకటనకు సంతోషం వ్యక్తం చేస్తారు. పలుకుబడి కలిగిన వారు మీకు మరింత చేయూతనిస్తారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు అనుకూలం.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.ఆంజనేయ దండకం పఠించండి.

కన్య
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు.  ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. అందరిలోనూ మీసమర్థత చాటుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి.  ఉద్యోగాలలో అనుకూలస్థితి.  విద్యార్థులకు ఊహించిన ఫలితాలు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సహకరిస్తారు.  వారం చివరిలో ఆరోగ్యభంగం. కష్టానికి ఫలితం ఉండదు. నీలం, ఆకుపచ్చ రంగులు అనుకూలం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది.

తుల
కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు రాదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిద్దుకుని అందర్నీ మెప్పిస్తారు. వ్యాపారాలలో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఉత్సాహం పెరుగుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. తెలుపు, గులాబీ రంగులు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠనం మంచిది.

వృశ్చికం
ఎటువంటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.  వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత రాణిస్తారు. ఉద్యోగాలలో  అదనపు పనిభారం, ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు అనుకూలం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్నింటా సహాయపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి తోడ్పాటునిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో  విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా  సాగుతాయి. నిరుద్యోగులు కొత్త ఉపాధి అవకాశాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, ఎరుపు రంగులు అనుకూలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఇంద్రాక్షిస్తుతి మంచిది.

మకరం
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొత్తగా రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యభంగం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తత పాటించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు నిరాశ.  రాజకీయవర్గాలకు చికాకులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. నీలం, నలుపు రంగులు అనుకూలం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వీరభద్రస్వామిని ఆరా«ధించండి.

కుంభం
పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు కొంత అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని ఖర్చులు అదుపుచేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎట్టకేలకు పైపోస్టులు సాధిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది.  వారం చివరిలో ధన వ్యయం. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, పసుపు రంగులు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.శివాష్టకం పఠించండి.

మీనం
చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో చిక్కులు సమర్థవంతంగా అధిగమించి ముందడుగు వేస్తారు.కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఎరుపు, తెలుపు రంగులు అనుకూలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top