ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 04-05-2025 To 10-05-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

May 4 2025 5:10 AM | Updated on May 4 2025 5:10 AM

Weekly Horoscope In Telugu From 04-05-2025 To 10-05-2025

మేషం...
ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవార్డులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం...
చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాల్లో  ఆటంకాలు తొలగుతాయి. నూతనోద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు.. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి.

మిథునం...
అనుకున్న సమయానికి డబ్బు సమకూరక కొంత ఇబ్బందిపడవచ్చు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా కొనసాగుతాయి. కొన్ని వివాదాలు నెలకొన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగేవీలుంది. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు.. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం...
ఆర్థిక వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగి లబ్ధి చేకూరుతుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. చాకచక్యంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఉన్నతశ్రేణి వారితో పరిచయాలు ఏర్పడవచ్చు.. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న  మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

సింహం...
అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి విషయాలలో సోదరుల నుంచి అనుకూల సంకేతాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య...
కొన్ని పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. పరిచయాలు విస్తృతమవుతాయి.  ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. మీ ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు అందుతాయి. వారం  చివరిలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు.  లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

తుల...
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కుటుంబసభ్యులు మీపై మరింత ఆదరణ చూపుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

వృశ్చికం..
అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ వ్యూహాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు..
ఆర్థికంగా కొంత పురోగతి కనిపించినా రుణాలు సైతం చేస్తారు. మిత్రులు, బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో  శుభవార్తలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

మకరం......
వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులకు మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తారు. అందరిలోనూ గౌరవానికి లోటు ఉండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త విధుల్లో చేరవచ్చు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో వివాదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం.....
ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ అభిప్రాయాలు, మనోగతాన్ని కుటుంబసభ్యులు గౌరవిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. శత్రువులను సైతం ఆదరిస్తారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. వ్యాపార లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం...
నూతనంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు  బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలు తుది దశకు చేరుకుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. వ్యయప్రయాసలు. ఎరుపు, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement