వారంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళం

Weekly Horoscope In Telugu 01-08-2021 To 07-08-2021 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు అభివృద్ధిదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు వివాదాలు కొంత పరిష్కారమవవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఎంతటి పరిస్థితినైనా చాకచక్యంగా అధిగమించి ముందుకు సాగుతారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులలో నూతనోత్సాహం. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు ముందుకు కొంత నిరుత్సాహపరిచినా క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సామాన్యస్థితి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి. సోదరుల నుంచి సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. వారం చివరిలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు అనుకూల సమాచారం అందుతుంది. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. పట్టుదల, ధైర్యంతో సమస్యలు అధిగమిస్తారు. సన్నిహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. అయితే, విధుల్లో కొంత అప్రమత్తత అవసరం. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. మానసిక అశాంతి. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు  పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే అనుకూలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు బాధ్యతలు కొంత తగ్గి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. అవసరాలకు సరిపడు ధనం సమకూరుతుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఎంతటి వారినైనా నేర్పుగా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందినా సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో సహచరులతో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ఖర్చులు అధికం. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్టాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
నూతన వ్యక్తుల పరిచయం ఉపకరిస్తుంది. అనుకున్న వ్యవహారాలు నిర్దేశించిన సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి సంతోషకర సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి అప్పులు తీరతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబసమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరించడంలో పురోగతి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినా ఆత్మవిశ్వాసంతో వాటిని పరిష్కరించుకుంటారు. రాబడికి ఇబ్బందులు తొలగి అవసరాలు తీరతాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మిత్రులు, బంధువుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో అనుకూల పరిస్థితులు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడతాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు సైతం నచ్చడం విశేషం. పలుకుబడి, హోదాలు ఉన్న వ్యక్తులు పరిచయమవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూవివాదాలు పరిష్కరించుకుని లబ్ది పొందుతారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న విధుల్లో చేరతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. నీలం, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా మారుతుంది. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. దీక్ష, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆస్తుల విషయంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారంతో సతమతమవుతారు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. బంధువుల కలయిక. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top