ఈ రాశి వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి

Today Horoscope In Telugu 15-11-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.ఏకాదశి ఉ.8.34 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రా.8.26 వరకు, తదుపరి రేవతి వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ప.12.05 నుండి 12.50 వరకు తదుపరి ప.2.22 నుండి 3.07 వరకు, అమృతఘడియలు... ప.3.29 నుండి 5.06 వరకు, ప్రబోధనైకాదశి.

సూర్యోదయం :    6.08
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు:
మేషం.. పనులలో జాప్యమే. దూర ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.

వృషభం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. 

మిథునం.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహార విజయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.   

కర్కాటకం.. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య భంగం. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలలో లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. 

సింహం.. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు ఆటుపోట్లు. 

కన్య.. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు శుభవార్తలు.

తుల.. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కారం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త ఆశలు.

వృశ్చికం.. వ్యయప్రయాసలు. రాబడికి మించి ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు.  దూర ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీలు.  

ధనుస్సు.. ఆర్థిక  ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపార విస్తరణ యత్నాలు వాయిదా. ఉద్యోగ మార్పులు.

మకరం.. ఆసక్తికర సమాచారాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. 

కుంభం.. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా సమస్యలు.  బంధువర్గంతో  విరోధాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు స్థాన చలనం.

మీనం.. నూతన ఉద్యోగయోగం. మిత్రుల నుంచి కీలక సమాచారం. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కీలక సమాచారం. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top