Today Horoscope In Telugu: Rasi Phalalu 01-06-2022 - Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు, అన్నింటా విజయమే

Jun 1 2022 6:21 AM | Updated on Jun 1 2022 8:25 AM

Today Horoscope 01-06-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.విదియ రా.7.11 వరకు, తదుపరి తదియ నక్షత్రం మృగశిర ఉ.11.09 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం రా.8.30 నుండి 10.15 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుండి 12.22 వరకు అమృతఘడియలు... రా.2.43 నుండి 4.22 వరకు. 

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటుంబంలో ఒడిదుడుకులు. దేవాలయాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. 

వృషభం: వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. 

మిథునం: అనుకున్న ఆదాయం రాక ఇబ్బందులు. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగమార్పులు. .

కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు.  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయాల సందర్శనం. 

సింహం: కార్యక్రమాలలో విజయం. అనుకూలత. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది. 

కన్య: పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులు. వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వివాదాలు నెలకొంటాయి.వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. 

తుల: కుటుంబసభ్యులతో విరోధాలు. శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. 

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపార, ఉద్యోగాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.

ధనుస్సు: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న రాబడి దక్కుతుంది. వస్తులాభాలు. పాతస్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: వ్యయప్రయాసలు. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి.

కుంభం: కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దేవాలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి. 

మీనం: చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement